ఆ క్షణంలో ఆమెలో చోటుచేసుకునే సున్నితమైన శారీరక పరిణామాలు కొన్ని గమనించవచ్చు. ఆమె కనుపాపలు పెద్దవవుతాయి. చనుమొనలు బిగుసుకుని ఉంటాయి. మొత్తం శరీరం అదో రకమైన ఉద్వేగంలో పరుగులు తీస్తుంటుంది. ఇవన్నీ ఆమెలో జరుగుతున్నాయా, లేదా అని చూడాలంటే సెక్స్ సుఖం కాస్తా దూరమైపోతుంది. అంగస్తంభన అర్థంతరంగా ఆగిపోతుంది. ఆ దశలో ఆమెకు ఈ పరిణామం చికాకును తెప్పిస్తుంది. కాబట్టి రతి సమయంలో స్త్రీ భావప్రాప్తికి లోనవుతుందా, లేదా అనే విషయాన్ని స్త్రీకే వదిలేయాలి. పురుషుడు దానిని పరీక్షించాలని చూడకూడదు.
ఇకపోతే కొందరు స్త్రీలు ఒకసారికన్నా ఎక్కువసార్లు భావప్రాప్తిని పొందుతారు. ఈ భావప్రాప్తికి మూలం మెదడు. కనుక ఆ సమయంలో యోని ఎలా ఉంది అనే అంశం ప్రధానం కాదు. రతి తారాస్థాయికి వెళ్లినప్పుడు మెదడుకు సంకేతాలు అందుతాయి. మెదడు స్పందనతో భావప్రాప్తి దానంతట అదే జరిగిపోతుంది. కనుక సెక్స్ చేసే సమయంలో స్త్రీ తృప్తి చెందిందా, లేదా అని తెలుసుకోవాలనుకోవడం అనవసరమంటారు సెక్సాలిజిస్టులు.