•  

వేకువ జాము సెక్స్ మంచిది

Early Morning Sex
 
దంపతులు మధ్య జరిగే శృంగారం ఎప్పుడు ఎక్కడ జరగాలనే విషయంపై చాలామందిలో అనేక అపోహలు ఉంటున్నాయి. సెక్స్ కార్యం రాత్రిపూట మాత్రమే జరగాలని, అదీ పడకగదిలో మాత్రమే జరగాలని కొందరు చెబుతుంటారు. అలాగే పగటిపూట శృంగారం మంచిది కాదని అలా చేసేది రాక్షసులు మాత్రమేనని కూడా మరికొందరు చెబుతుంటారు. అయితే ప్రముఖ సెక్సాలజిస్టులు చెబుతున్న ప్రకారం సెక్స్‌కు కావాల్సింది భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కోరికే తప్ప సమయం సందర్భం కాదు. వీరు చెబుతున్న ప్రకారం భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం లేనపుడు సమయం, సందర్భం ఎంత మంచిగా ఉన్నా వారి మధ్య జరిగే శృంగారం అంతగా రాణించదంటున్నారు. దంపతుల మధ్య సెక్స్ గురించి ఇటీవల అమెరికాలోని ఔత్సాహిక పరిశోధకులు నిర్వహించిన ఓ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

దీని ప్రకారం సెక్స్‌లో తరచూ పాల్గొనే మహిళల్లో డిప్రెషన్‌లాంటి సమస్యలు తక్కువగా ఉన్నాయని తేలింది. అలాగే ఉదయం పూట సెక్స్‌లో పాల్గొనే దంపతుల్లో ఆరోగ్యం మెరుగవుతోందని కూడా తెలియవచ్చింది. వారంలో దాదాపు మూడుసార్లు ఇలా ఉదయం పూట సెక్స్‌లో పాల్గొన్నవారిలో రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా రక్తప్రసరణ సైతం చక్కగా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. వీటితోపాటు ఉదయంపూట సెక్స్‌లో పాల్గొనే వారిలో రోగనిరోధకశక్తి సైతం పెంపొందినట్టు వారి పరిశోధనల్లో తేలిందట. అలాగే సెక్స్ వల్ల స్త్రీల ఆరోగ్యం కూడా మెరుగుపడుతోందని వారు చెబుతున్నారు.

Story first published: Wednesday, November 17, 2010, 15:58 [IST]

Get Notifications from Telugu Indiansutras