•  

సెక్స్ తో యవ్వనం సాధ్యమా

Youthfulness with Sex
 
యవ్వనంగా కనపడేందుకు చాలా మంది ఏదో ఒక మందును వాడుతుంటారు. ముఖ్యంగా వయసుపైబడినవారు అందుకు ఎక్కువ ప్రయత్నాలు సాగిస్తుంటారు. కాని కాస్మొటిక్స్ వాడటానికి బదులుగా కాసింత సెక్స్ జరిపితే అందంగానూ, యవ్వనంగానూ ఉండొచ్చంటున్నారు స్కాట్‌ల్యాండ్‌లోని రాయల్ ఎడిన్‌బర్గ్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధనకులు తెలిపారు.వీరి పరిశోధనల్లో తేలిందేంటంటే...కనీసం తక్కువ వ్యవధిలో(అంటే వారానికి మూడు సార్లు) ఓ మనిషి సెక్స్‌లో పాల్గొంటే అతని వయసు కన్నా కూడా చాలా చిన్నవానిగా కనిపిస్తాడు. సెక్స్ చేయడం వ్యాయామం చేసినదాంతో సమానం, ఎందుకంటే రతిక్రియ జరిగే సమయంలో శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం చేసిన ఫలితం ఉంటుంది. దీంతో ముంఖంలో నిగారింపు వస్తుంది. ఇది శరీరంలోని చర్మంపై కూడా ప్రభావం చూపిస్తుంది వారు వివరించారు.

దీనికి సంబంధించి పరిశోధకులు కొన్ని దిశానిర్దేశాలుకూడా ఇచ్చారు. ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకోవడం, ముద్దులాడుకోవడం, ఏకాగ్రతతో సెక్స్ లో పాల్గొనడంలాంటివి చేయాలి. ముఖ్యంగా తమ భార్యలతోనే సెక్స్ లో పాల్గొనాలని కూడా వారు సూచిస్తున్నారు. ఎందుకంటే పరిచయం లేని వారితో సెక్స్ జరిపితే వారికున్న అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందనివారు హెచ్చరిస్తున్నారు. అలాగే మరోవైపు "ఫోర్ ప్లే" లేకుండా చేసే రతిక్రియలో ఒత్తిడి అధికంగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. పరిచయంలేని స్త్రీలతో చేసే సెక్స్ వలన మనసులో భయంతోబాటు ఒత్తిడి తీవ్రంగా ఉండి రతిక్రియ సుఖాన్ని పూర్తిగా అనుభవించలేరంటున్నారు. దీంతో మానసికంగానూ, శారీరికంగానూ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో శరీరం ముదుసలివయసులాగా మారిపోతుందని, కాబట్టి కేవలం తమ సతీమణితో చేసే సెక్స్ వల్ల లాభాలను పొందగలరని పరిశోధకులు వివరిస్తున్నారు.

Story first published: Wednesday, October 27, 2010, 16:22 [IST]

Get Notifications from Telugu Indiansutras