సెక్స్ కు లైట్ అవసరమా?

భార్యాభర్తల మధ్య పడకగది శృంగారం రకరకాలుగా ఉంటుంది. ఒక్కోరిది ఒక్కో తీరు ఉంటుంది. కొందరు భాగస్వాముల మధ్య ఈ విషయమై చిలిపి గొడవలు కూడా ఆవుతుంటాయి. అయితే కొంతమంది భర్తలుగానీ, భార్యలు గానీ సెక్స్ చేస్తున్నప్పుడు లైట్ ఉంచుతారు. ఇది కొంతమంది భాగస్వాములకు నచ్చదు. తన భార్య లేదా భర్త అందాలను చూడాలని వారు కోరుకోవటం వల్లనే లైటు వేసుకుంటారు. అలాంటి కోర్కెలు కలుగడం సహజమే. సెక్స్ చేస్తున్నప్పుడు స్త్రీలో కలిగే హావభావాలు, సిగ్గు దొంతరలు, చిలిపి చూపులు అవన్నీ మగాడిని మరింతగా సెక్స్ పట్ల ఆసక్తిని కలుగజేస్తాయి.

భార్యభర్తల మధ్య సిగ్గు అనేది రతిలో ఉండకూడదు. అలా ఉంటే రతిని సంతృప్తిగా ఆనందించలేరు. ఒకరికి తగినట్లు మరొకరు నడుచుకుంటూ, అడిగి వడ్డించినట్లు, కొసరి మరీ తినిపించినట్లు భర్తకు భార్య తన ఇష్టాలను చెప్పి, శ్రీవారి ఇష్టాలను తెలుసుకుని నడుచుకుంటే శృంగారంలోని మాధుర్యం అద్భుతంగా ఉంటుందంటున్నారు.

Please Wait while comments are loading...