•  

నిరోదక మాత్రలు వాడితే సెక్సు కోరికలు చచ్చిపోతాయి

Sexual Feelings
 
గర్భ నిరోధక మాత్రలు తరచూ వాడటం మూలాన మహిళల్లో సెక్స్ కోరికలు చచ్చిపోతాయని శాస్త్రజ్ఞులు వెల్లడించినట్లు ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక వెలువరించిన కథనాన్ననుసరించి రతిక్రియ ద్వారానే స్త్రీలు తమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తారని, దీంతో వారు ఎంతో చలాకీగా తమ పనులు పూర్తి చేసుకుంటుంటారని డాక్టర్లు అంటున్నారు. అయితే నిత్యం గర్భ నిరోధక మాత్రలు వాడుతుంటే వారిలో సెక్స్ కోరికలు చచ్చిపోయి ఏదో కోల్పోతున్నామనే భావన వారిలో కలుగుతుంటుందని, దీంతో వారు తాను చేసే పనుల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరిచే స్థితిలో ఉండరని తమ పరిశోధనల్లో తేలిందని ఆమె తెలిపారు.ప్రస్తుత సమాజంలో మహిళలు చాలామంది హార్మోన్లతో కూడుకున్న గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా వాడుతున్నారు.గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళలు తమలో కలిగే సెక్స్ కోరికలను ఓ రకమైన వ్యాధిగా భావిస్తుంటారని ఆమె అభివర్ణించారు.

ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరి పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుందని, మిగిలిన ముగ్గురి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంటుందని ఆమె అన్నారు. గర్భ నిరోధక మాత్రలు వాడే స్త్రీలలో సెక్స్ కోరికలు తగ్గిపోతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని ఆమె స్పష్టం చేసినట్లు ఆ పత్రిక వెల్లడించింది. ఇదిలావుండగా కండోమ్‌లలాంటి సురక్షితమైన గర్భ నిరోధక సాధనాలకు బదులుగా హార్మోన్లతో కూడుకున్న గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళల్లో సెక్స్‌పట్ల విముఖత చూపిస్తున్నట్లు మరో పత్రిక ది డైలీ టెలిగ్రాఫ్ తెలిపింది.

Story first published: Wednesday, October 20, 2010, 16:25 [IST]

Get Notifications from Telugu Indiansutras