పెళ్లయిన కొత్తలో చాలామంది యువతులకు సెక్స్ అంటే భయం ఉంటుంది. పడక గదిలో భర్తను దగ్గరకు రానీయరు. అయితే భర్త మాత్రం ఆమె సెక్స్ పట్ల అయిష్టత చూపుతున్నా ఆక్రమించాలని చూసి భంగపడతారు. తొలిరేయి పడకింటిలో భార్య అలా ప్రవర్తించడానికి వెనుక కారణాలు చాలా ఉంటాయి. కుటుంబ పరిస్థితులను బట్టి కొందరిలో సెక్స్ అంటేనే విముఖతను పెంచుకుంటారు. దీంతో వారిలో ఫ్రిజిడిటీ చోటుచేసుకుంటుంది. అటువంటి పరిస్థితి ఏర్పడినపుడు సెక్స్ విషయంలో మనసు స్పందించదు. అలా స్పందించినప్పుడు భర్త పట్ల కూడా అయిష్టత ఏర్పడుతుంది.
భర్త ఈ పరిస్థితిని గమనించి కొంతకాలం సెక్స్‌ కు దూరంగా ఉంటూ ఆమెను సెక్స్ ‌కు సమాయత్తపరిచేందుకు అవసరమైన పద్ధతులను అవలంభించాలి. ప్రేమ సంభాషణలు చేస్తూ అప్పుడప్పుడు కామోద్రేకాన్ని రేపే శరీర భాగాలపై సున్నితంగా, ప్రేమగా నిమురుతూ మాటలతోనే దారికి తీసుక వచ్చేందుకు కృషి చేయాలి. ఆమెకు సంతోషం కలిగించే పనులు ఏమిటో తెలుసుకుని వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేస్తూ పోతే ఏదో ఒకనాడు ఆమె సెక్స్ ‌‍కు ఆహ్వానం పలుకుతుంది. అప్పటిదాకా ఓర్పు తప్పనిసరి. ఓర్పు లేకపోతే తీయని అనుభూతులను పంచాల్సిన సెక్స్ సుఖం చేదు అనుభవాలను మిగులుస్తుంది.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.