శృంగారంలో మూడు దశలున్నాయి. బాహ్య పురుషుడికి బాహ్య స్త్రీకీ మధ్య జరుగుతుంది. అది దేహానురక్తి. ఇది తొలి దశ. అంతర్ పురుషుడికి ఆంతర్ స్త్రీకి మధ్య జరుగుతుంది. అధి భావానురక్తి. ఇది రెండోది. అత్యున్నతమైన అర్ధనారీశ్వరం. ఇది పరానుక్తి. ఇది మూడోది. కాళిదాసు రచనగా ప్రచారంలో ఉన్న శృంగార తిలకమ్ లో కథానాయకుడు ఓ అడుగు ముందుకేసి పాపం ఎవరో పిచ్చి సాధకుడు సుఖమో, దుఖమో తెలియని స్థితిని పట్టుకొని మోక్షమని పేరు పెట్టాడు. నా దృష్టిలో మాత్రం నా మత్తు కన్నుల జవరాలి చీరముడి విప్పటమే మోక్షం అని తమకంగా చెప్పుకున్నారు. ఆ మాట కొంత వరకు నిజమే. మోక్షం అంటే విముక్తి అన్న అర్ధమూ ఉంది.