జగ్గీవాసుదేవ్ సెక్సులో బాధ్యత చాలా అవసరం అంటాడు. హద్దుల్లేని, బాధ్యతలేని విశృంఖల లైంగిక జీవితంపట్ల పాశ్చాత్య దేశాల్లో దాదాపు ఓ తరం పిల్లలంతా ఆనాథలై పోయారు. ఆ వరిస్థితి మనకు రాకూడదు. మనకే కాదు. ఎవరికీ రాకూడదని హితవు చెబుతారు ఆయన. బాధ్యతలేని శృంగారం పశువాంఛతో సమానం. ఆ బాధ్యత లోపించటం వల్లే నవమాసాలు మోసిన తల్లి, తన బిడ్డకు తండ్రెవరో నిరూపించుకోవడానికి డిఎన్ఎ పరీక్షల దాకా వెళ్లాల్సి వస్తోంది. ఆ బాధ్యత లోపించటం వల్లే కొందరు కాముకులు ఎయిడ్స్ లాంటి భయంకర వ్యాధుల్ని భార్యాపిల్లలకు అంటగడుతున్నారు. ఆ బాధ్యత లోపించటం వల్లే ఎన్నో కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. సెక్స్ బాధ్యాతాయుతమైన ఆనందమని గుర్తించగలిగితే ఇన్ని సంక్షోభాలు ఉండవు. ప్రాచీనులు సెక్స్ కు, ఆధ్యాత్మికతకు ముడి పెట్టడానికి ఇదీ ఒక కారణం. దేవుడి పేరుతే ఆ బాధ్యతని గుర్తు చేయడమే.