హస్తప్రయోగం వల్ల వ్యాయామం చేసిన వృధా అవుతుందనే అపోహలున్నాయి. అలాగే బలం తగ్గుతుందనే దురభిప్రాయం కూడా ఉంది. హస్తప్రయోగం చేసుకోవడం వల్ల వ్యాయామం చేసినా వృధా అవుతుందనేది నిజం కాదు. దేనికదే. శరీర దారుఢ్యానికి వ్యాయామం అవసరమే. దాన్ని ఆపాల్సిన అవసరం ఏమీ ఉండదు. హస్తప్రయోగం చేసుకునే అలవాటును మానాల్సిన అవసరం కూడా లేదు. అది అత్యంత సహజంగా జనించే కోరిక. దాన్ని ఆపితే టెన్షన్ పెరుగుతుంది. అలా ఆపితే వీర్యం దానంతటదే బయటకు వస్తుంది. అందువల్ల హస్తప్రయోగం వల్ల బలం తగ్గుతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.