ఆలుమొగలూ ఒకరినొకరు తెలుసుకోవడానికి మరింత దగ్గర కావడానికీ ఎన్నో ఉత్సవాలు జరిగేవి. కౌముదీ జాగరణం (శరత్కాలంలో వెన్నెల విహారం), నవపత్రికా (వసంతమాస ప్రేమయాత్రలు), ఏక శాల్మలీ (బూరుగు చెట్ల కింద పాటలు)... ఇలా ఇరవైరకాల ప్రణయయాత్రల గురించి ప్రస్తావించాడు వాత్సాయనుడు. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులకు కామశాస్త్రం బోధించానికి అనిభవజ్జులైన గురువులు ఉండేవారట. శృంగారానికి బంగారమంత విలువలనిచ్చిన సమాజమది. ఓ కళగా ఆరాధించారు. పవిత్రంగా అవిష్ఠించారు. ఈ వైభోగమంతా ధర్మానికి లోబడే. విలువలకు కట్టబడే. వాత్సాయనుడు తన రచనను...ధర్మాక్థకామేభ్యోనమ అంటూ మొదలుపెట్టాడు. ధర్మం, అర్థం...వరకైతే ఫర్వాలేదు. మరీ, కామానికి నమస్కారం ఏమిటి అని ఎవరూ అభ్యంతర పెట్టలేదు. మొహం ముడుచుకోలేదు. శృంగారం అంటే అంత గౌరవం. చట్టసభల్లో చర్చలు జరిగేవి. విశ్వవిద్యాలయాల్లో అధ్యయనాలు జరిగేవి. పండిత సభల్లో వాదోపవాదాలు జరిగేవి.