ప్రియుడు అనుకాగపూర్వకంగా ప్రియురాలి పెదవిపై పంటితో చేసే గాట్లను గూఢకము అంటారు. పెదవులు ఎడమబుగ్గపై దంతక్షతాలు కొంచెం గట్టిగా కొరుకుతూ చేసిన దంతక్షతాలను ఉచ్ఛూనకము అంటారు. కింది పెదవిపై మరియు బుగ్గలపై అభ్యాస విశేషంతో చేసి దంతక్షతాన్ని ప్రవాళమణి అంటారు. పెదవులపై గూఢకం, ఉచ్ఛూనకము కింది పెదవిపై మరియు బుగ్గలపై ఆభ్యాస విశేషంతో చేసే దంతక్షతాన్ని ప్రవాశమణి అంటారు. పెదవులపై గూఢకం, ఉచ్ఛూనకము, ప్రవాళమణి అనే మూలరకాల దంతక్షతాలు చేస్తారు. తేడా ఏమిటంటే గూఢకంలో పెదవులపై కొరకరు. పళ్లతో పెదవులను మృదువుగా పట్టుకొని పెదవులు ఎర్రగా అయ్యేంత వరకు ఒత్తుతారు.
పెదవులపై కొరకడం ఉచ్ఛూనకం అంటారు. దీన్లో పళ్లగాట్లు స్పష్టంగా కనపడుతాయి. ప్రవాళమణిలో పురుషుడు, స్త్రీ పెదవులని తన పళ్లు, పెదవులతో మాటిమాటికి ఒకేచోట గట్టిగా ఒత్తుతాడు. గాట్లు పడవుగాని, పెదవులు ఉబ్బుతాయి. ఉచ్ఛూనకం, ప్రవాళమణి, దంతక్షతాలని బుగ్గలపై కూడా చేయవచ్చు. పెదవులపై కన్నా బుగ్గలపై కొంచెం గట్టిగా కొరకవచ్చు.
ప్రియుడు ప్రియురాలి పెదవులపైమధ్యలో ఒక చుక్క పడేట్టు రెండు పళ్లతో కొరికితే బిందువు వంటి చిహ్నం ఏర్పడుతుంది. రెండు పెదవులపై అన్ని పళ్లతో కొరికితే మణిమాల వంటి గుర్తులు పడతాయి. ఈ మణిమాల దంతక్షతాల్ని పెదవులపైనే కాక బాహుమూలాలు, నుదురు, మెడ, గజ్జలలో ప్రయోగించవచ్చు.