•  

సంభోగంపై స్త్రీకి ఎలా ఆసక్తి కలిగించాలి

How a Women Accept to it
 
కామ విషయాలు ఏమాత్రం తెలియని యువతులు సంభోగాన్ని(సెక్స్)ను ద్వేషిస్తారు. వారికి ఇష్టం లేకుండా సంభోగానికి బలవంతం చేస్తే వారు సెక్స్ తో పాటుగా భర్తను, మగవారిని ద్వేషించే ఆస్కారం ఉంది. రతిపైనే వారికి పూర్తిగా అయిష్టత కలుగుతుంది. కాబట్టి రతి విషయంలో మగవారు తొందరపడకూడదు. వారికి కొద్దికొద్దిగా ప్రేమ విషయాలు చెప్పాలి. ఆ తర్వాత కామ విషయాలవైపు మళ్లించాలి. నెమ్మదిగా వారికి రతి పట్ల ఆసక్తి కలిగేటట్లు చేయాలి.

మొదట యువతికి తరుణ స్త్రీల ద్వారా ప్రేమ భావమును కలిగించే ప్రయత్నం చేయాలి. సమయాన్ని చూసుకొని ఏకాంత ప్రదేశములోగాని, చీకటిలోగాని ఆలింగనము చేసుకోవడంగాని, నుదుటిపై చుంబించటంగాని, నోటికి తాంబూలం అందించటంగాని చేయాలి. అయితే ఆ సందర్భంలో ఆమె ఏ పరిస్థితిలో ఉన్నదో చూసుకోవాలి. ఒకవేళ ఆమెకు అవి ఇష్టంగా లేనట్లుగా గమనిస్తే ప్రేమ వాక్కులతో ఆమెనుంచి విశ్వాసాన్ని పొందగలగాలి. ఆమెతో పాటు రతి విషయంలో తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించాలి. ఒక్కొక్క మాటలో ఏమీ తెలియనట్టుగానే ఉంటూ తనకు అన్ని తెలిసేలా చేయాలి. మెల్లిమెల్లిగా తనలో కామ భావనలు కలిగేలా చూసి తనకు రతిపై ఆసక్తి కనిపించిన తర్వాత సంభోగానికి ఉపక్రమించాలి.

Story first published: Thursday, September 16, 2010, 16:49 [IST]

Get Notifications from Telugu Indiansutras