శృంగార సామర్ధ్యానికి అనేక శారీరక మనసిక కారణాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా భాగస్వామిపై తీవ్రమైన ఆకర్షణ ఉండాలి. ప్రేమ, ఇష్టం, భాగస్వామి సహాయ సహకారాలు, ప్రేరణ, ఉత్సాహం. ఆరోగ్యం, అవసరం, అవకాశంఅ, పరిసరాలు, పరిస్ధితులు ఇటువంటి అనేక అంశాలు రతి సామర్ధ్యంపై ప్రభావం చూపిస్తాయి. మగవాళ్ళల్లో యవ్వనం తొలిరోజుల్లో ఆ వాంచ తీవ్రంగా ఉంటుంది. రతిని నిర్వహించే శక్తి కూడా బాగా ఉంటుంది. ఆరోగ్య సూత్రాలు పాటిస్తే అదే టెంఫోను డెబ్బై ఏళ్ళ వరకు కొనసాగించవచ్చు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించవచ్చు.
ఆకలి, దాహం ఎటువంటివో సెక్స్ కూడా అటువంటిదే. సెక్స్ ను అపవిత్రంగా ఎప్పుడూ భావించకూడదు. పూర్వీకులు డెబ్బై ఎనభై ఏళ్ళ వరకు సెక్స్ ను అనుభవించేవారు. అయితే ఆమె సహకారం చాలా అవసరం. ఇప్పటి వాళ్ళు ఆ సహకారం అందించలేనంత టెన్షన్లలో ఉంటున్నారు.