పాపం ఆ అందమైన భార్యకు ఇన్ని చిట్కాలు తెలియవు. నా భర్త నా సొంతం అనుకుంటుంది. ఇవాళ తనకు మూడ్ లేకపోయినా తను సర్దుకుని మూడు రోజుల తర్వాతైనా తన కొంగుపట్టుకుని తిరగకపోతాడా అనుకుంటుంది. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు. స్నేహితుల ద్వారా కొన్ని కొత్త పరిచయాలు తగులుతాయి. కొత్త ఒక వింతగా కన్పించినప్పుడు పాత ఒక రోతగా కన్పించక మానదు. సెక్సంటే ఆ కొత్త వ్యక్తి చిరునవ్వులు, గిలిగింతలే గుర్తొస్తాయి. ఇది ఎవరి తప్పూ కాదు. కేవలం కొత్తదనానిదే తప్పు.
ఆ కొత్త వ్యక్తి పాత్రను భార్యే వేయవచ్చు. మాటి మాటికీ ఫోన్ చేసి గోముగా మాట్లాడి అతడు ఎన్ని పనుల్లో ఉన్నా ఇంటికి అర్జెంటుగా రప్పించుకోవచ్చు. ఆ సీజన్ లో లభించే పూలను తలలో ఇముడ్చుకుని అతను రాగానే మైమరిపించవచ్చు. అయితే దంపతుల ప్రైవేటు జీవితానికి ప్రధాన అడ్డంకులు చిన్న పిల్లలు. అతను వచ్చే లోపే వారికి గోరు ముద్దలు తినిపించి మంచి లాలి కథలు చెప్పి నిద్రపూచ్చేయడం ఆమె బాధ్యత. ఆ తర్వాత భార్యాభర్తలు తమ మదన సామ్రాజ్యమైన పడక్ గదికి చేరుకోవాలి. ఆతర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్ట్లు వాళ్ళు..అయితే సంభోగం అనేది సమభోగం. ఆ సామ్రాజ్యంలో ఇద్దరిదీ చెరి సగం, ఒక అంగుళంలో కూడా సరిహద్దు విభేదాలు ఉండకూడదు సుమా!