మానసిక నపుంసకత్వానికి కారణం వారిలో సెక్సువల్ పెర్ ఫార్మెన్స్ కు సంబంధించిన యాంగ్జయిటీ ఉండడమే. కొంత మంది మిత్రులు ఆడవాళ్ళకు సంబంధించి కొన్ని విషయాలను ప్రచారం చేస్తుంటారు. ఆడవాళ్ళు కామ పిశాచులని, వాళ్ళను రతిలో సంతృప్తి పరచడం కష్టమని చెబుతూ ఉంటారు. బ్రహ్మచారుల మనసుల్లో ఆ విషయాలు గట్టిగా నాటుకుపోయి పెర్ ఫార్మెన్స్ యాంగ్జయిటీ వస్తుంది. మామూలుగా అన్ని విషయాల్లో ఎంతో డైనమిక్ గా ఉండే వ్యక్తులు కూడా సెక్స్ విషయంలో భయం భయంగా ఉంటారు. నిజానికి చాలా మంది ఆడవాళ్ళు ప్రేమ స్వభావంతో ఉంటారు. వారికి మగవారి నుంచి ప్రేమ కావాలే కానీ సెక్స్ ప్రధానం కాదు. ప్రేమ తర్వాతే వాళ్ళు సెక్స్ ను కోరుకుంటారు. కేవలం యాంత్రిక సెక్స్ ను కోరుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి స్త్రీని ప్రేమించడం నేర్చుకుంటే ఇటువంటి మానసైక సమస్య్లు దూరమవుతాయి.
స్త్రీ అసంతృప్తి వ్యక్తం చేసినా, అతని సామర్ధ్యాన్ని అవహేళన చేసినా మానసిక నపుంసకత్వం ఎక్కువవుతుంది. ఈ విషయంలో ఆమె కూడా తెలివిగా సంస్కారవంతంగా ప్రవర్తించాలి. మొదటి రోజు ఫెయిల్యూర్ మరుసటి రోజు ఫెయిల్యూర్ కి కారణమవుతుంది. ఆమె అతనికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఇవాళకాకపోతే రేపైనా అది జరుగుతుందన్న నమ్మకాన్ని అతనిలో కలిగించాలి. అప్పుడు నిజంగా అతను రతి వీరుడుగా మారిపోతాడు. ఆమె మదన సామ్రాజ్యాన్ని చక్కగా ఏలుకునేవాడవతాడు. ఆమె చేయవలసిందల్లా అతనికి కొన్ని రోజులపాటు ధైర్యం నూరిపోయడమే.