•  

శీఘ్రస్కలనం సమస్య పెద్ద సమస్య కాదు

Premature Ejaculation can be cured
 
రతిలో అసంతృప్తిని అశ్రద్ధ చేయకూడదు. అది చివికి చివికి గాలివానలా మారుతుంది. శృంగారంలో సరైన సుఖం సంతోషం పొందనప్పుడు తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. అంశాంతి చోటు చేసుకుంటుంది. ఈ అసంతృప్తి తన మీద, భాగస్వామి మీద, పిల్లల మీద, పనివాళ్ళ మీద, స్నేహితుల మీద, బంధువుల మీద రకరకాలుగా ప్రభావం చూపిస్తుంది. రతిలో పూర్తి స్ధాయి ఆనందం పొందినప్పుడు నిరాశా నిస్పృహలు, ఓటమి భయాలు ఉండవు.

భాగస్వామిలో అసంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అమెతో తనకేమైనా అసంతృప్తి ఉంటే ప్రేమగా, సుతి మెత్తగా చెప్పుకోవాలి. ఒకరికొకరు సంపూర్ణ సహకారాలు అందించుకుంటూ శృంగారంలో అసంతృప్తిని పారదోలవచ్చు. ఇది సున్నిత వ్యవహారం. రతిలో తృప్తి ఒక హక్కు, ఒక బాధ్యత. అసంతృప్తి అనేది లైంగిక హింసే.

అధిక శాతం మహిళలు పురుషుల ప్రవర్తన వల్ల శృంగారంలో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. హిస్టీరియా వంటి అనేక మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫోర్ ప్లే (రతికి ముందు ముద్దూ ముచ్చట) లేకుండానే మగవాడు తొందరగా దులిపేసుకుపోవడం వల్ల ఆమె నిద్రలేని రాత్రులను బాధగా అనుబవించవలసి వస్తుంది. అంత ఆబగా, కక్కుర్తిగా రతిలో పాల్గొనాల్సిన అగత్యం ఏమొచ్చింది? మగవాడి శీఘ్ర స్కలనం సమస్య ఆడవారికి పెద్ద శాపం. శీఘ స్కలనానికి ప్రత్యేక మందులు అవసరం లేదు. రోజుకి కొంత సేపు యోగా, ధ్యానం, రెండు మూడు సెషన్ల కౌన్సిలింగ్ చాలు.

కొందరు స్త్రీలు కనీసం 10 నిముషాలు రతి సాగిస్తే తప్ప భావప్రాప్తి పొందలేరు. క్లెయిమాక్స్ స్ధితిలో గట్టి స్ట్రోక్స్ కోరుకుంటారు. ఆ సమయంలో నీరుగారిపోతే ఆమె మొహం కోపంతో అసంతృప్తితో ఎర్రబారిపోతుంది. అందువల్ల ఫోర్ ప్లే ద్వారా స్త్రీని బాగా ప్రేరేపించి అప్పుడు ఆరోహించి, కుదురుగా రతి సాగిస్తే ఆమె భావ ప్రాప్తి పొంది హాయిగా ఉండగలుగుతుంది.

Story first published: Thursday, April 1, 2010, 17:41 [IST]

Get Notifications from Telugu Indiansutras