•  

సంభోగం తర్వాత నిద్రా భాగ్యం!

Deep Sleep after Intercourse
 
ఎక్కువ మంది మగవాళ్ళు సంభోగం చేసిన తర్వాత గాఢ నిద్రలోకి వెళ్తారు. రతిలో పాల్గొన్నప్పుడు పురుషులలో రక్త నాళాలు బాగా ఉబ్బడం, కళ్ళల్లో అదో రకమైన వెలుగు కన్పించడం సహజం. పురుషుడిలో రక్తమంతా పొత్తి కడుపులోకి పంప్ చేసినట్టు అవుతుంది. భావప్రాప్తి కలగడంతో శరీర కండరాలు రిలాక్స్ అవుతాయి. వీర్య స్కలనంతో అతని మెదడులో సిరోటిన్ అనే పదార్ధం విడుదల అవుతుంది. గాఢ నిద్రకు ఆ పదార్ధమే కారణం.

ఇక్కడ మరో కోణాన్ని చూడాలి. ఆడవాళ్ళకి ఫోర్ ప్లే, ప్లే ఎంత ముఖ్యమో ఆఫ్టర్ ప్లే కూడా అంతే ముఖ్యం. ఆమెకు సంభోగం తర్వాత అంత త్వరగా నిద్ర పట్టదు. అతను రతి తర్వాత ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకోవాలి. సభల్లో ఓట్ ఆఫ్ థాంక్స్ లాంటిదే ఇది. అలా కనీసం పది నిముషాలైనా ఉండి ఆ తర్వాత పక్కకు తిరిగి నిద్రిస్తే బాగుంటుంది.

Story first published: Monday, April 19, 2010, 17:12 [IST]

Get Notifications from Telugu Indiansutras