వయాగ్రా వంటి లోషన్ తో సెక్సోత్స్సాహం

Underarm Lotion
 
వయాగ్రా సెక్స్ కు వండర్ డ్రగ్ అయినప్పటికీ దానివల్ల కొన్ని దుష్పరిణామాలు ఉన్నాయి. ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా అంగస్తంభనను కలిగించే లోషన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. దీనిని చంకల్లో స్ప్రే చేసుకుంటే అంగ స్తంభన సమస్య ఉన్న వారి సమస్య నిముషాల్లో పరిష్కారమవుతుంది. అంతే కాదు సుదీర్ఘ కాలం పాటు రతి క్రీడను సాగించగల సామర్ధ్యాన్ని కూడా ఇది ఇస్తుంది.

సాధారణంగా 45 ఏళ్ళ వయసు దాటిన పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ లోషన్ ఆ లోపాన్ని సవరించి సెక్స్ బలహీనతను పోగొడుతుంది. దీనిపేరు ఆక్సిరాన్, 2011 లో అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లలో విడుదల కానుంది. 100 మంది పురుషులపై ప్రయోగించి చూడగా 84 మందిపై బాగా పని చేసినట్టు రుజువైంది. కోరిక తక్కువగా ఉన్న వారు దీనిని స్ప్రే చేసుకున్న తర్వామ కొదమ సింహాల్లా కన్పించారట.

అక్రుక్స్ లిమిటెడ్, యుఎస్ ఫార్మాసిటికల్స్, ఎలిలిల్లి సంస్ధలు ఈ లోషన్ అమ్మకానికి సంయుక్త ఒప్పందం చేసుకున్నాయి. ఆక్సిరన్ ను ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేసే హక్కులు ఎలి లిల్లికి దక్కనున్నాయి.

Story first published: Wednesday, March 24, 2010, 15:50 [IST]
Please Wait while comments are loading...