•  

వయసు పెరిగే కొద్దీ సెక్స్ పసందు

Middle Age Sex
 
వయసు పైబడే కొద్దీ స్త్రీ పురుషుల్లో లైంగిక వాంఛలు తగ్గిపోతాయని సాధారణంగా అనుకుంటూ ఉంటాం. లైంగిక వాంఛలు యవ్వనదశలోనే బాగా నెరవేరుతాయని సమాజం భావిస్తున్న అంచనాలు పొరపాటని తాజాగా ఓ సర్వే తెలుపుతోంది. వయసు మీరే కొద్దీ తమ సెక్స్ జీవితాలు రంజుగా మారుతున్నాయని భారతీయ మహిళలు పరోక్షంగా, పాశ్చాత్య మహిళలు గట్టిగా చెబుతున్నారు.

యవ్వనంలో కంటే 34 ఏళ్ల నడిప్రాయంలోనే తాము మరింత సెక్సీగా ఉంటామని సగటు మహిళ భావిస్తున్నట్లుగా ఓ తాజా సర్వే చెబుతోంది. యవ్వన దశలో ఉన్నప్పటికంటే నడివయస్సులోనే సెక్స్ కోరికలను ఎక్కువగా తాము తీర్చుకోగలుగుతున్నామని బ్రిటన్ మహిళలు చెప్పారు.

ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు తమ సెక్స్ జీవితాలు గతంలో కంటే ఇప్పుడే బాగున్నాయని చెప్పారు. 20 లేదా 30 ఏళ్ల ప్రాయంలో తాము నెలలో 10 సార్లు సెక్స్‌లో పాల్గొనగా 45, 60 ఏళ్ల మధ్యకాలంలో 4.5 సార్లు శృంగార జీవితం గడుపుతున్నామని వీరు చెప్పారు. అయితే 34 ఏళ్ల వయసులో తాము సెక్స్ జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించామని వీరి అభిప్రాయం.

మహిళల లైంగిక వాంఛలు, లిబిడో, జీవన శైలి కాలానుగుణంగా మారుతూ వస్తాయనడం వాస్తవమే. అయితే మధ్య వయసులో మహిళలు తమ లైంగిక వాంఛలను మునుపటిలానే తీర్చుకోలేరని చెప్పడం హేతువిరుద్ధంగా ఉంటుందని ఈ సర్వేలో పాల్గొన్న మహిళల నిశ్చితాభిప్రాయం, వృద్ధాప్యంలో కూడా తమ లైంగిక జీవితం సంతృప్తిగా కొనసాగుతోందని వీరు చెప్పడం ఆశ్చర్యకరం.

దీనికి కారణం కూడా ఉంది మరి. 20 లేదా 30 ఏళ్ల వయసుతో పోలిస్తే మహిళలు తమ నడివయస్సు ప్రారంభంలో మరింత ఆత్మవిశ్వాసంతోనూ, స్వావలంబనతో జీవితం గడుపుతున్నారు. తమకు కావలసిన దాన్ని పొందడంలో ఈ వయసులో వారికి ఎలాంటి భయసంకోచాలు ఉండవని సర్వేలో పాల్గొన్న 50 శాతం మంది మహిళలు పేర్కొన్నారు.

Story first published: Sunday, March 28, 2010, 10:57 [IST]

Get Notifications from Telugu Indiansutras