సహజంగా పురుషులే ఎక్కువగా ఇటువంటి ఊహా ప్రేరణల్లో, ఊహా రతుల్లో పాల్గొంటూ ఉంటారు. ఇటువంటి మానసిక స్ధితి మహిళల్లో చాలా అరుదు. అలా ఊహల్లోకి వెళ్ళే సాహస మహిళలు లేకపోలేదని అనేక సర్వేలలో తేలింది. ఇలాంటి ఊహలు స్వయంతృప్తి సమయంలో బాగా ఉంటాయి. కానీ భాగస్వామితో ఉన్నప్పుడే అప్పుడప్పుడు ఇబ్బంది కలిగించవచ్చు.
శృంగార జీవితంలో తృప్తి, ఆనందం లభించనప్పుడు, భాగస్వామి ఆకర్షణీయంగా లేనప్పుడు ఊహా ప్రేరణలతో అనిర్వచనీయమైన ఆనందానుభూతులు పొందడంలో ఎటువంటి హానిలేదు. ఊహారతుల వల్ల పిచ్చి పడుతుందన్నది అపోహ మాత్రమే. కొందరు పురుషులు సినిమా తారలతో శృంగారం జరుపుతున్నట్టు ఊహించుకుంటారు. ఈ స్ధితి కొంత కాలం బాగా ఉంటుంది కానీ, ఊహకు వాస్తవానికి చాలా తేడా ఉంటుందన్న సత్యం బోధ పడిన తర్వాత అంగస్ధంభన అసలే జరుగదు. అప్పుడు సెక్సాలజిస్టుతో కొన్ని వారాల పాటు కౌన్సిలింగ్ తీసుకోవలసిందే. ఇలా ఊహల్లో జీవించడం కంటే జీవిత భాగస్వామిలోని మంచి లక్షణాలను ప్రేమించడం ద్వారా వారే ఆకర్షణీయంగా అన్పించేటట్టు మన మనసు ద్వారా మనం చేసుకోవచ్చు. అది అరోగ్యకరం.