ఆమె వంటగదిలో కుస్తీలు పడుతున్నప్పుడు వెళ్ళి కొంత సహాయం చేయండి. సరదా మాటలు చెబుతూ ఆమెకు అలుపు రానివ్వకుండా చేయండి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ముద్దు పెట్టుకోండి. సీన్ మారిపోతుంది. అలాగే ఒక పూటంతా టీవీ కట్టేసి, ఇష్టమైన స్నాక్స్, కూల్ డ్రింక్స్ పెట్టుకుని మాటల్లోకి జారిపోండి. అవి చాలా లైట్ విషయాలై ఉండాలి. బంధువుల పెళ్ళిళ్లలో తారసపడిన హాస్య్ సన్నివేశాలను ఆమెతో పంచుకోండి. జీవితం కొత్తగా మారిపోతుంది. ఇది ఏ నెలకో రెండు నెలలకో మాత్రమే. రోజూ అయితే ఇది కూడా బోర్ కొడుతుంది.
మరో సెలవు రోజు అచ్చంగా ఆల్బంల మీద పడండి. మధుర స్మృతులను ఆమెతో కలిసి మననంలోకి తెచ్చుకోండి. ఆమెను తోలిసారిగా మీరు ముద్దు పెట్టుకున్నరోజు, బీచ్ లో పరుగులు తీసి ఆ ప్రత్యేకమైన రోజు గుర్తుకు వచ్చి గిలిగింతలు పెడతాయి. ఎంగేజ్ మెంట్ రోజు, పెళ్ళి రోజు మళ్ళీ కళ్ళకు కొత్తగా కన్పిస్తాయి. తగ్గిపోయిన శారీరక ఆకర్షణ పుంజుకుంటుంది. శరీర రసాయన శాస్త్రం నోబెల్ బహుమతి అంతగా కన్పిస్తుంది.
కామిక్స్, జోక్స్ పుస్తకాలు కూడా మనసును ఆహ్లాదపరిచి వత్తిడులను తొలగిస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో అవసరమైన్ సెల్ కాల్స్ కే అటెండ్ కండి. ఆఫీసు విషయాలను సరస సంభాషణలోకి తీసుకురావద్దు.