•  

వృద్ధాప్యంలోనూ చక్కటి శృంగారం సాధ్యమే

Kamasutra
 
శృంగారానికి వయసుతో నిమిత్తం లేదు. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎంత వయసులోనైనా శృంగార క్ర్రీడలో పాల్గొనగలుగుతారు, కామోద్రేకం, శృంగార కోరికలతో స్పందించే హృదయం, హుషారైన మనసు ఉంటే అరవై, డెబ్బై, ఎనభై ఏళ్ల వయసులోనూ పురుషుడు ఆ క్రీడను సాగించగలడు.

వృద్ధులకు కూడా శృంగారం టానిక్ వంటిది. వృద్ధాప్యంలో శృంగారాన్ని ఆపాల్సిన అవసరం లేదు. మగవాళ్లకి జీవితాంతం అంగ స్ధంభనలు ఉంటాయి. మహిళలకు కూడా మెనోపాజ్ సమయంలో మినహా ఎంత వృధాప్యంలోనైనా కోరికలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

వృద్ధ పురుషుల్లో సెక్స్ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిని అర్ధం చేసుకోవాలి. కామోద్రేకంతో ఆలస్యంగా అంగం స్దంభించినా మళ్ళీ కొంచెం సేపటికి మెత్తబడుతుంది. కంగారు పడకుండా మళ్ళీ ప్రయత్నిస్తే రెండో సారి స్ధంభిస్తుంది. రెండోసారి గట్టి పడిన తర్వాత వీర్య స్ఖలనం అంతత్వరగా జరగదు. యువకుల్లా వీరు ఎక్సైట్ కారు కాబట్టే ఇలా.

మెనోపాజ్ దాటిన స్త్రీలు కూడా రతిలో హాయిని తృప్తిని పొందుతారు. వృద్ధాప్యంలో యోనిమార్గం యవ్వనంలో సాగినంతగా సాగదు. ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపంతో యోనిమార్గం లోపలి గోడలు పలుచగా మారుతాయి. ఎస్ట్రోజెన్ సప్లిమెంట్లను డాక్టర్ల సలహాలతో వాడాలి. కెవై జెల్లీ వంటి లేపనాలను రాసుకుంటే ఒరిపిడి వల్ల నొప్పులు ఉండవు. యవ్వనంలో అర నిముషంలో యోనిలో ద్రవాలు స్రవిస్తే వృద్ధాప్యంలో ఒకటి నుంచి మూడు నిముషాలు పట్టవచ్చు.

వృద్ధాప్యంలో దంపతులు ఒకరినొకరు అర్ధం చేసుకుని ముందుకు సాగాలి. సరస సంభాషణలు టానిక్ లా పనిచేస్తాయి. ఎంత వృధాప్యంలోనైనా ఇప్పటికీ కనీసం వారానికోసారైనా సెక్స్ సుఖం పొందుతున్న దంపతులు ఉన్నారని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం చెప్పారు.

Story first published: Tuesday, December 29, 2009, 18:12 [IST]

Get Notifications from Telugu Indiansutras