లివ్ లైఫ్ "బిగ్ సైజ్"

Candom
 
సెక్స్ విషయంలో నాణ్యతకున్నంత ప్రాధాన్యం పరిమాణానికి కూడా ఉంటుంది. ఆమె వక్షోజాలు పెద్దగా ఉండాలని అతను కోరుకుంటాడు. ఆయనది ఇంకా పెద్దగా ఉండాలని ఆమె కోరుకోవచ్చు. అందువల్లనే బ్రిటీష్ రిటైల్ జెయింట్ టెస్కో డ్యూరెక్స్ ఎక్స్ ట్రా లార్జ్ కండోమ్స్ అమ్మకాలను ప్రారంభించింది. ఇప్పుడు ఇండియాలో కూడా ఇవి విరివిగా లభిస్తున్నాయి.

ఈ ప్రత్యేక కండోమ్స్ కు స్పందన ఎక్కువగా ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. "పెద్ద అంగం గల పురుషులకు ఎంతో సౌకర్యవంతంగా ఈ కండోమ్స్ ను డిజైన్ చేశారు" అని టెస్కో అమ్మకాల ప్రతినిధి నికొలా ఎవాన్స్ చెప్పీనట్టు టెలిగ్రాఫ్ పత్రిక రాసింది.

ఈ కండోమ్స్ సాధారణ కండోమ్స్ కంటే 10 మి మీ పొడవుగా ఉన్నట్టు ఆ పత్రిక రాసింది. గత ఏడాది కస్టమర్ల నుంచి ఈ ఎక్స్ ట్రా లార్జ్ కండోమ్స్ కోసం 200 కాల్స్ వచ్చినట్టు ఎవాన్స్ వివరించారు. ఈ సూపర్ మార్కెట్లో లభించే వాటిలో అత్యధిక ఆదరణ పొందుతున్నవి డ్యూరెక్స్ ఫెదర్ లైట్, డ్యూరెక్స్ ఎక్స్ ట్రా సేఫ్.

Story first published: Friday, September 25, 2009, 13:42 [IST]
Please Wait while comments are loading...