కండోమ్స్ వాడకం విషయంలో సరైన సమాచారాన్ని పొందడంలో, సందేహాలను తీర్చుకోవడానికి తగిన ప్రయత్నాలు చేయకపోవడంతో అపోహలు నెలకొన్ని ఉన్నాయి. కండోమ్స్ వాడకం వల్ల కలిగే ఉపయోగంపై కూడా అవగాహన చాలా మందిలో సరిగా లేదు. ఈ అయోమయానికి ఎక్కడో ఓ దగ్గర అంతం పలకాల్సే ఉంటుంది.
కండోమ్స్ విఫలం కావడం అనేది 2 శాతానికి మించి లేదు. సరిగా ధరించకపోవడం వల్ల మాత్రమే చాలా సందర్భాల్లో వైఫల్యాలు ఎదురవుతున్నాయి. మహిళ యోనిలోకి వీర్యకణాలు ప్రవేశించకుండా గట్టి పడిన పురుషాంగంపై కండోమ్ ధరించాల్సి ఉంటుంది. లేటెక్స్, పాలియురెథేన్, పాలిసోప్రీన్‌తో తయారైన కండోమ్‌లను వాడడం మంచింది. ఎలర్జీ పేరు మీద కండోమ్ వాడక పోవడం కూడా సమస్యనే.
ఒక్క కండోమ్ కన్నా రెండు కండోమ్‌లు ధరించే సేఫ్ అని కొంత మంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. రాపిడి ఎక్కువగా జరిగినప్పుడు కండోమ్ చిరిగే అవకాశం ఉంటుంది. సుదీర్ఘమైన, రఫ్ సెక్స్ వల్ల కండోమ్ చిరిగిపోయే అవకాశం ఉంది. ఆయిల్ ఆధారిత లూబ్రికెంట్స్ వాడడం వల్ల, తడారిపోయే యోని వల్ల, పదునైన పరికరం ద్వారా కండోమ్ ప్యాకేజీని తెరవడం వల్ల కండోమ్స్ దెబ్బ తినే అవకాశం ఉంది.
కండోమ్స్‌ను కూల్, డ్రై ప్లేస్‌లో భద్రపరచడమనేది ముఖ్యం. విపరీతమైన వేడి లేదా తేమ వల్ల సంభోగం సమయంలో కండోమ్ దెబ్బ తినవచ్చు. ఏమైనా, కండోమ్స్ వాడకం విషయంలో తగిన అవగాహన అవసరం