రతిక్రీడలో కండోమ్ పెద్ద అడ్డంకి, మూడ్ పాడు చేస్తుంది... అంటూ చాలామంది జంటలు భావిస్తూంటారు. అయితే, ఆరోగ్యాన్ని పాడుచేసుకోరాదంటే కొన్ని పద్ధతులు అవలంబించాల్సిందే! ఎల్లపుడూ లూబ్రికేట్ చేయబడ్డ కండోమ్ మాత్రమే వాడండి. అది పగిలిపోకుండా అంగప్రవేశం కూడా తేలికగా జరిగిపోతుంది. కొన్నిసార్లు మహిళలు రతిక్రీడలో ఆసక్తి లేకపోవటం వలన ద్రవాలను స్రవించరు. అపుడు కండోమ్ కు గల లూబ్రికేషన్ బాగా పనిచేస్తుంది. కండోమ్ ధరించేముందు వీటిని పాటించండి.
1. సాధారణంగా దొరికేది కాక, ఎపుడూ సరి అయిన సైజు కండోమ్ నే ధరించండి. కండోమ్ దేనికి ఉపయోగిస్తున్నారో నిర్ణయించుకోండి. గర్భవతులు కాకుండా రక్షణకా లేక అంగప్రవేశం తేలికై సంతోషం కలగటానికా లేక నోటితో సెక్స్ చేసేందుకా అనేది నిర్ణయించుకోండి.
2. మరీ అధిక బిగువు కల కండోమ్ అసౌకర్యంగా వుండి చినిగిపోవచ్చు. లేదా పెద్దదైతే బయటకు పడి అనవసర ఇబ్బందులు కలగవచ్చు. కనుక సరి అయిన సైజు వాడకం సూచించదగ్గది.
2. నోటితో సెక్స్ చేయాలనుకుంటే మంచి వాసనగల కండోమ్ ధరించండి. అదికూడా మీ భాగస్వామికిష్టమైన ఫ్లేవర్ సుమా! మరల అదే కండోమ్ ను అంగ ప్రవేశానికి వాడకండి. నోటిసెక్స్ కు వాడే కండోమ్ లకు తియ్యగా వుండటానికి షుగర్ కలుపుతారు. అది అంగప్రవేశ సమయంలో అనవసర క్రిములను లోపల ప్రవేశపెడుతుంది.
4. అధిక సురక్షితమంటూ ఒకదానిపై ఒకటిగా అదనపు కండోమ్ ధరించకండి. ఇలా చేస్తే అధిక రాపిడి కలిగి కండోమ్ లు తేలికగా పగిలిపోయే అవకాశం వుంది.
5. స్కలనానికి ముందు ఒకసారి కండోమ్ తీసివేస్తే మరల దానినే ధరించకండి. సురక్షితంగా వుండాలంటే కొత్తది ధరించండి.
6. రొమాన్స్ అధికం చేసుకోడానికి అంగప్రవేశంలో వివిధ రకాల అనుభవాలకు రకరకాల లూబ్రికేటెడ్ కండోమ్ లు ధరించండి. ఇరువురికి ఇష్టమైన వాటినే ధరించండి. ప్రత్యేకించి మీ భాగస్వామికిష్టమైనదే వాడండి.