సెక్స్- పురుషుల్లో ఆ భయం!

మామూలుగా పురుషుల్లో చాలామంది స్త్రీలతో సెక్స్ విషయంలో భయపడుతూంటారు. తమ ఫర్ ఫార్మన్స్ ని ఆమె ఏ విధంగా జడ్జ్ చేస్తోందోనని వారి అనుమానం . ఒక వేళ తృప్తి పరచకపోతే ఆమె తనని మగాడే కాదంటుందేమో ఇలా సాగుతాయి ఆలోచనలు ...ఇలాంటి ప్రెషర్స్ ఎక్కువైతే అవి దారితీసి అంగస్ధంబించటం మానివేస్తుంది. ఇలా అంగస్ధంబన ఫెయిల్యూర్స్ మాటిమాటికీ కలిగినట్లయితే అది ఇంపోటెన్స్ కి దారితీస్తుంది. ఫిజికల్ గా ఎలాంటి లోపం లేకపోయినా కేవలం ఏక్జైటీ వల్ల,భయం వల్లా కూడా ఇంపోటెన్స్ కలుగుతుంది. నిజానికి ఫరఫార్మెన్స్ అనే పదమే చాలా భయం గొలిపేదిగా ఉంటుంది. తనను తాను అందరిముందూ ఫ్రూవ్ చేసుకోవాలనే అర్ధం స్ఫురిస్తూంటుంది.

సాధారణంగా సెక్సువల్ సక్సెస్ కి సంభందించిన బర్డెన్ అంతా మగాడి నెత్తినే మోపడం జర్గుతూంటుంది. అంతేగాక మన చుట్టూ ఉన్న సమాజం సెక్స్ ని విజయవంతంగా చేసేవాడే మగవాడు అనే భావనను అతడిలో క్రియేట్ చేస్తారు. దాంతో ఈ విధంగా అతను 16-17 ఏళ్ళు వచ్చేసరికి అతను గొప్ప టెన్షన్ లో పడిపోతూంటాడు. అందులోనూ సంప్రదాయకంగా మనకు సెక్స్ కు సంభందించిన సరైన నాలెడ్జ్ ఉండదు. మరొక వైపు ఫర్ ఫార్మన్స్ కు సంభంధించిన హై ఎక్సపెక్టేషన్స్ . ఈ రెండింటికీ సమన్వయం కుదరదు. దాంతో సాధారణంగానే ఏంగ్జైటీ,డిప్రెషన్స్ కి లోనయ్యే అవకాశం ఉంటుంది.

చాలామంది సెక్స్ ను ఒక ఆనందించే విషయంగా గాక ఒక టెస్ట్ లా చూస్తారు. ఇలా సెక్స్ ను ఒక పర్ ఫార్మన్స్ గా మాత్రమే గాక ఇతరులతో పోటీపడే ఓ అంశంగా కూడా చూస్తారు. సెక్స్ ఇతరులతో పోటీపడే అంశం కాదు. స్త్రీ,పురుషులిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడుతూ అనుభవించేది. సెక్స్ అనేది మారధాన్ రేస్ కాదు...సెక్స్ నుంచి ఆనందాన్ని జుర్రు కోవాలే కానీ ఎవరితోనో పోటీ పడుతున్నట్లుగా భావించి టెన్షన్ డెవలప్ చేసుకోవద్దు. ఇతర పురుషులతో పోల్చుకోవద్దు. సెక్స్ చేస్తున్నప్పుడు కేవలం అందులోని ప్లెజర్బుల్, ఎరోటిక్ సెన్సేషన్స్ మీదనే మీ దృష్టంతా కాన్సెంట్రేట్ చెయ్యాలి. అలా అయితేనే మీరు విజయం సాధిస్తారు.

Please Wait while comments are loading...