•  

భార్యలను మార్చుకొని శృంగారం.. గ్రామాలకు పాకిన డర్టీ కల్చర్

భారతీయ సంస్కృతిలో ఏడు జన్మల బంధంగా భావించే వివాహం, ఇప్పుడు కేవలం ఒక వ్యాపార ఒప్పందంగా మారిపోయిందా? తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో జరిగిన సంఘటన చూస్తే ఈ సందేహాలు నిజమేననిపిస్తాయి. విదేశీ సంస్కృతిగా భావించే వైఫ్ స్వాపింగ్ (భార్యలను మార్చుకోవడం) మన దేశంలోనూ పాతుకుపోవడం సమాజాన్ని కలవరపరుస్తోంది. ప్రాణ స్నేహితులైన ఇద్దరు వ్యక్తులు తమ భార్యలను మార్చుకోవాలని నిర్ణయించుకోవడం చివరకు పోలీసుల జోక్యంతో బయటపడింది.

స్నేహబంధం నుండి దగా వరకు...
ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మణ్‌పూర్‌ గ్రామానికి చెందిన అనుప్ యాదవ్, పప్పు కోరి అనే ఇద్దరు మిత్రులు అహ్మదాబాద్‌లో ఒకే గదిలో ఉంటూ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. ఒకరి కష్టంలో మరొకరు అండగా నిలిచేవారు. వారి స్నేహం ఎంతో ఆదర్శంగా ఉండేది. కానీ ఆ నమ్మకమే వారి మధ్య దగాకు దారితీసింది. పప్పు ఊళ్లో లేని సమయంలో అనుప్, పప్పు భార్యతో సంబంధం పెట్టుకొని ఆమెను తనతో తీసుకెళ్ళిపోయాడు.

Wife Swapping Scandal in UP  Friends  Betrayal Leads to Bizarre Settlement Demands
 

దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు
ఈ వ్యవహారం చివరకు పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ ఇద్దరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. అనుప్ భార్య కన్నీళ్లతో తన భర్త తనను బలవంతంగా తన స్నేహితుడు పప్పుతో కలిసి జీవించమని ఒత్తిడి చేశాడని ఆరోపించింది. అదే సమయంలో పప్పు, అనుప్ తన భార్యను తీసుకెళ్ళిపోయాడని పోలీసులకు వాపోయాడు. ఈ వివాదంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన మలుపు... పప్పు భార్య కోరిన డిమాండ్లు. తనను వదిలి వెళ్లినందుకు గాను పరిహారంగా రూ. 5 లక్షల నగదు, ఒక కొత్త బైక్ కావాలని డిమాండ్ చేయడం పెను సంచలనం సృష్టించింది.

బంధాలు ఎందుకు దారితప్పుతున్నాయి?
ఈ ఘటన ప్రేమ, నమ్మకాల స్థానంలో డబ్బు, డిమాండ్లు చోటుచేసుకుంటున్నాయని నిరూపిస్తోంది. పాశ్చాత్య దేశాల సంస్కృతి మన సమాజంలోకి చొచ్చుకు రావడం, భార్యాభర్తల మధ్య సంభాషణ లోపించడం, పరస్పర అపనమ్మకం వంటివే ఇలాంటి విపరీత పోకడలకు కారణమని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమస్యలు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప, భాగస్వాములను మార్చుకోవడం బంధాలను శాశ్వతంగా నాశనం చేయడమే కాకుండా చట్టపరమైన చిక్కులను కూడా మిగులుస్తుంది.

English summary
A shocking incident of wife swapping in a village in Uttar Pradesh has come to light, involving two friends. The case, which ended up with police intervention, took a dramatic turn when one of the wives demanded a hefty cash and a new bike as a settlement.
Story first published: Friday, August 22, 2025, 14:26 [IST]

Get Notifications from Telugu Indiansutras