శృంగారం అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. ఇది రెండు వ్యక్తుల మధ్య భావోద్వేగాలను, శారీరక అనుబంధాన్ని పెంపొందిస్తుంది. శృంగారం అనేది కేవలం శారీరక కార్యం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా. భారతీయ సంప్రదాయంలో శృంగారాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం దాన్ని కేవలం ఓ కార్యక్రమంలా మాత్రమే చూస్తారు. అయితే ప్రస్తుతం మన దేశంలో కూడా శృంగారానికి ఉన్న పవిత్రత తగ్గిపోతూ వస్తోంది.
ఇదిలా ఉంటే భారత స్త్రీల శృంగార జీవితం గురించి ప్రముఖ నటి నీనా గుప్తా చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. కెనడియన్-ఇండియన్ యూట్యూబర్ లిల్లీ సింగ్‌తో నీనా గుప్తా మాట్లాడుతూ, భారతదేశంలోని 95% మంది మహిళలకు సెక్స్ కేవలం పురుషులను సంతోషపెట్టడానికి, పిల్లలను కనడానికి మాత్రమేనని, అది తమ ఆనందం కోసం కూడా అని వారికి తెలియదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలకు ఆమె తన యవ్వనంలో చూసిన సినిమాలను ఉదాహరణగా చూపించారు. గతంలో వచ్చిన సినిమాలు పురుషులకు తామే బాస్ అనే భావనను కలిగించాయని, చిన్నప్పుడు ముద్దు పెట్టుకుంటే గర్భం వస్తుందని కూడా తాను నమ్మానని ఆమె గుర్తు చేసుకున్నారు.
అయితే, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో మహిళల పాత్రల్లో గణనీయమైన మార్పు వచ్చిందని, ఇప్పుడు మహిళలకు ప్రాధాన్యత లభించడం సంతోషంగా ఉందని నీనా గుప్తా అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడటం వల్ల ఇప్పుడు పురుషుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహించడానికి సిద్ధంగా లేరని ఆమె పేర్కొన్నారు. సెక్స్‌ను ఒక తప్పుగా చూడకుండా, దాని గురించి బహిరంగంగా చర్చించడం వల్ల మహిళలపై లైంగిక వేధింపులు తగ్గుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.నీనా గుప్తా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తుండగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.
నీనా గుప్తా వ్యక్తిగత జీవితం
నీనా గుప్తా ఒక ప్రముఖ నటి మరియు దర్శకురాలు. ఆమె హిందీ, మలయాళ చిత్రాల్లో నటించారు. ఆమె తన కెరీర్‌లో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డు మరియు రెండు ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులు గెలుచుకున్నారు.
నీనా గుప్తా జీవితంలో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. 1977లో అమలన్ కుసుమ్ ఘోస్‌ను మొదట వివాహం చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత, వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో ప్రేమలో పడ్డారు. వారికి మసాబా గుప్తా అనే కూతురు ఉంది. చివరిగా 2008లో ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారు.



Click it and Unblock the Notifications




