రతిక్రీడలో ఒకే రకమైన పద్ధతి లేదా ఒకే రకమైన భంగిమ దంపతులకు బోర్ కొట్టవచ్చు. దాంతో శృంగారం యాంత్రికంగా మారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దంపతులు శృంగారంలోని తీపిని ఆస్వాదించాలంటే ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అవలంభించాలి.
వాత్సాయనుడు తన కామసూత్రలో కొన్ని వందల రతిభంగిమలను చెప్పాడు. దంపతులు శృంగార రసాన్ని ఆస్వాదించడానికి వివిధ భంగిమలను ఎంచుకోవచ్చు. ప్రదేశాలను బట్టి కూడా ఈ భంగిమల ఎంపిక ఉండాలి.
కూర్చుని, పక్కపక్కన పడుకుని సెక్స్ చేసే భంగిమలున్నాను. కౌగర్ల్ పొజిషన్, డాగీ పొజిషన్, మిషనరీ పొజిషన్ అని వివిధ పేర్లతో పిలిచే భంగిమలున్నాయి. అయితే, పురుషుడు పైన ఉండి సెక్స్ చేసే సంప్రదాయమే మన దేశంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్టాండర్డ్ మిషనరీ పొజిషన్...
మామూలుగా దంపతులు ఎక్కువ పాటించే భంగిమను స్టాండర్డ్ మిషనరీ పొజిషన్ అంటారు. స్త్రీ కింద పడుకొని పురుషుడు పైన ఉండి సెక్స్ చేసే పద్ధతి ఇది. ఇద్దరి ముఖాలు ఇందులో ఎదురెదురుగా ఉంటాయి. ఇది శృంగారంలో సహజమైన భంగిమ.ఈ భంగిమలో పాల్గొంటే స్త్రీలు తృప్తి పొందుతారని చాలామంది అనుకుంటారు. దీన్నే ఎక్కువగా పాటిస్తారు.
అయితే ఇలా...
అయితే, స్టాండర్డ్ మిషనరీ పొజిషన్‌లో స్త్రీలకు క్లిటోరిస్‌పై నేరుగా స్పర్శ కలగదు. దానికితోడు, పురుషుడు తన బరువంతటిని రెండు చేతులపై ఉంచి సంభోగం జరిపే ప్రయత్నం చేస్తాడు. దాంతో స్త్రీలోని వివిధ కామకేంద్రాల్ని ప్రేరేపించే అవకాశం వుండదు. అయినా, ఇదే ఎక్కువగా వాడుకలో ఉంది.
స్త్రీ పైన ఉండి....
స్త్రీ పైన ఉండి జరిపే రతిక్రీడను పురుషాయితం అంటారు. ఈ భంగిమలో స్త్రీకి వివిధ కామకేంద్రాలు ప్రేరేపణకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైగా, రతిక్రీడ మొత్తం స్త్రీ ఆధీనంలో ఉంటుంది. ఎంత వేగంగా శృంగారం జరపాలి, ఎలా చేస్తే తృప్తి కలుగుతుందనేది స్త్రీ నియంత్రణలో ఉంటుంది. భర్తకు శీఘ్రస్ఖలనం వున్నవారిలో ఈ భంగిమ ఉపయోగకరంగా వుంటుందని అంటారు. భార్యకన్నా భర్త లావు ఎక్కువగా వున్న దంపతుల్లో కూడా పురుషాయితం సౌకర్యంగా కూడా వుంటుంది.
డాగీ స్టైల్....
డాగీ స్టైల్లో భంగిమలో పురుషుడు లేదా స్త్రీ క్లిటోరిస్ ను ప్రేరేపించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. క్లిటోరిస్ పై స్పర్శ కలిగించడం భంగిమతో సంబంధం లేకుండా స్త్రీకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. గర్భావస్థలో డాగీ భంగిమ మంచిది. కొందరు స్త్రీలలో ఈ డాగీ భంగిమలో పొత్తికడుపులో నొప్పిని కలిగిస్తుంది. అందువల్ల సౌకర్యంగా ఉంటేనే ఈ భంగిమను ఎంచుకోవాలి.