•  

సెక్స్‌లో రసపట్టుకు మరవకూడని అంశాలు ఇవీ...

సెక్స్ అనే పదాన్ని ఉచ్చరించడానికి సంప్రదాయవాదులు చాలా మంది సిగ్గుపడుతుంటారు. దంపతులు ఒకరిపై ఒకరి పట్ల ఉన్న ఆకర్షణను మాటల్లో చెప్పుకోవడానికి కూడా బిడియపడుతుంటారు. అయితే, కాలం మారింది. సెక్స్ ఇప్పుడు నిషేదిత పదం కాదు.

దాంపత్యం నాలుగు కాలాలు పచ్చగా సాగాలంటే, భార్యాభర్తల మధ్య సయోధ్య ఉండాలంటే శృంగారం అత్యంత ప్రధానమైన విషయం. శృంగారాన్ని తనివితీరా ఆస్వాదించే దంపతులు ఉల్లాసంగా ఉంటారు. వారి మధ్య అవగాహన పెరుగుతుంది.

అయితే, సెక్స్ చేయడానికి సిద్ధపడినప్పుడు పురుషులు కొన్ని విషయాలు మరిచిపోకూడదు. పురుషుల్లో ఈ విషయంలో కొన్ని అపోహలున్నాయి. ఆ అపోహలను తొలగించుకుని సరైన పద్దతిలో సాగితే శృంగారంలో ఓ పట్టు పట్టి ఆనందాన్ని జుర్రుకోవచ్చు.

సెక్స్‌కు ముందు తిండి ఇలా...

సెక్స్‌కు ముందు తిండి ఇలా...

సెక్స్ శారీరక ఆనందాన్నే కాదు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. దేహానికే కాదు, మనసుకూ ఊరటనిస్తుంది. శృంగారాన్ని ఆస్వాదించడానికి అదే పనిగా తినకూడదు. భోజనం చేసిన వెంటనే సెక్స్‌కు వెళ్లకూడదు. తినుబండారాలు కూడా అదే పనిగా తీసుకోవద్దు . దానివల్ల మధ్యలో బెడిసికొట్టే ప్రమాదం ఉంది. జీర్ణక్రియలో మెదడు పడిపోయి, సెక్స్‌కు అంతగా సహకరించదు. పెద్ద ప్రమాదాలు సంభవించకపోయినా తృప్తికరంగా మాత్రం సాగదు.

మద్యపానంపై అపోహలు

మద్యపానంపై అపోహలు

మద్యపానం చేసిన తర్వాత సెక్స్ మజాగా ఉంటుందనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ అది నిజం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మద్యపానం చేసిన పురుషుడు సెక్స్ చేస్తే స్త్రీకి అంతగా ఆనందాన్ని ఇవ్వదు. మద్య సేవించిన వ్యక్తికి కూడా అంతగా సెక్స్ ఆనందాన్ని ఇవ్వదు. మద్యం మత్తులో అసలు సెక్స్ చేస్తారనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. శీతల పానీయాలు కూడా ఎక్కువగా సేవించకూడదు.

కండలు తిరిగిన మగాడైతేనే...

కండలు తిరిగిన మగాడైతేనే...

కండలు తిరిగిన బలిష్టిడైన పురుషుడు సెక్స్ బాగా చేస్తాడనేది కూడా ఓ అపోహ. సెక్స్ చేయడానికి సిక్స్ ప్యాక్ ఏమీ అవసరం లేదు. మానసిక దృఢత్వం మాత్రమే శృంగారంలో రసానుభూతిని కలిగిస్తుంది. అదే సమయంలో లుకింగ్‌పై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టకూడదు. మగాడు గానీ స్త్రీ గానీ నలుపుగా ఉన్నారా, తెలుపుగా ఉన్నారా అనేది కూడా అప్రధానమే. శృంగారంలో ఏ మేరకు చురుగ్గా పాల్గొనగలరనేదే ముఖ్యం.

అవసరమైతే ల్యూబ్‌..

అవసరమైతే ల్యూబ్‌..

ఈస్ట్రోజన్‌ లెవల్స్‌ తక్కువ మోతాదులో ఉండే మహిళల అంగంలోపల తడి ఆరిపోతుంది. దాని వల్ల పురుషుడి అంగం లోనికీ, బయటకు కదులుతున్నప్పుడు యోని రాపిడికి గురై మంట పుడుతుది.. అలాకాకుండా స్మూత్‌ సెక్స్‌ కోసం నీటిని లేదా సిలికాన్‌ ఆధారిత ల్యూబ్‌ను సెక్స్‌కు ముందు ఉపయోగించడం మంచిది.

మూత్ర విసర్జన చేయాలి...

మూత్ర విసర్జన చేయాలి...

సెక్స్‌కు ముందు మూత్ర విసర్జన చేస్తే మంచిది. అలాగే సెక్స్‌ చేసిన తర్వాత కూడా అది మంచిది. కొంతమందికి బ్లాడర్‌ సమస్యలుంటాయి. దానివల్ల సెక్స్ చేసే సమయంలో అసౌకర్యం కలుగుతుంది. ముందుగా మూత్ర విసర్జన చేస్తే సెక్స్‌ ఆహ్లాదకరంగా సాగిపోతుంది.

 

English summary
Five things should not be ignored before going for sex. These will help man and woman for better romance.
Story first published: Tuesday, May 2, 2017, 11:51 [IST]

Get Notifications from Telugu Indiansutras