రతిక్రీడకు పెద్దలు కొన్ని సమయాలు పెట్టారు. శృంగారంలో సమయానికి చాలా ప్రాధాన్యం ఉంది. మల్లె వేళ అనే ఓ సినిమా పాట ఉండనే ఉంది. అలాగే రాత్రికి రాత్రి వస్తానన్నావూ మామా అని ఓ వయ్యారి భామ తన ప్రియుడిని ఉద్దేశించి ఓ సినిమాలో పాడుతుంది.
నూతన వధూవరులకు శోభనం రోజు రాత్రి అంగ ప్రవేశానికి మంచి లగ్నం పెడ్తారు. ఇతర రోజుల్లో కూడా సెక్స్‌కు ఓ సమయం సందర్భం ఉందని నిపుణులు చెపుతున్నారు. వీటినే రతి క్రీడ గోల్డెన్ రూల్స్‌గా పిలుస్తారు.
అందువల్ల లైంగిక భాగస్వాములు సమయం సందర్భం చూసుకుని పడక ఎక్కితే అది ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు పడక ఎక్కితే అది ఎవరికో ఒకరికి అసంతృప్తిని మిగిల్చే అవకాశాలే ఎక్కువ. అందుకని వేళ చూసి కెైపెక్కి, మథనక్రీడ సాగించడమే మంచిది. ఇవన్నీ సాంప్రదాయకులు పెట్టిన నిబంధనలు ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చుకోవచ్చు.
పగటి పూట అయితే..
పగటి పూట రతిక్రియ చేయకూడదని అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఏకాంతం ఉండేలా, ఇతరులు ప్రవేశించి కదిలించకుండా చూసుకోవాలి.
రాత్రి వేళయితే..
రాత్రి సమయాల్లో రతిక్రీడ సాగిస్తే ఎందుకైనా మంచిది. వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యాన్ని ఎక్కువ సేపు ఒకేసారి చేయడం మంచిది.
మూడు గంటల వ్యవధి
భోజనం చేసిన తర్వాత వెంటనే రతిక్రీడకు ఉపక్రమించకూడదు. కనీసం మూడు గంటల వ్యవధి ఉంటే శృంగారాన్ని తనివి తీరా అనుభవించగలరు.
పాలు వద్దు..
నిద్రకు ఉపక్రమించే ముందు పాలు సేవించకూడదు. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంట ముందు తీసుకోవాలి. అది ఆరోగ్యానికి చాలా మంచిది.
రుతుక్రమం వేళ
స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించరాదు.తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. దానివల్ల జబ్బులకు దూరంగా ఉంటారు.
కేవలం అందుకే కాదు..
కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇలాంటి భావన మంచిది కాదు. తనివితీరా దంపతులు ఆనందాన్ని అనుభవించడానికి శృంగారమనే భావన ఉండాలి.
దానికి ముందు ఇలా..
రతిక్రియకు ముందు రొమాంటిక్ మాటలు మాట్లాడుతూ.. ఫోర్ప్లే చేసుకుంటూ స్త్రీ భావప్రాప్తి పొందేలా చేయాలి. ఆ తర్వాత అంగ ప్రవేశం చేసినట్టయితే సెక్స్లో పాల్గొన్న స్త్రీపురుషులిద్దరూ సంతృప్తి పొందుతారని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.