కొంత మంది స్త్రీలు రతిక్రీడ పట్ల విముఖత ప్రదర్శిస్తుంటారు. పురుషుడు ఎంతగా బతిమాలినా ఏదో కారణం చెబుతుంటారు. అయితే, మహిళలు చెప్పే కారణాలను పురుషులు శ్రద్ధగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెక్స్ ఇష్టం లేక అలా చెబుతోందని చాలా మంది పురుషులు అనుకుంటారు. కొందరయితే అలాంటి కారణాలు పెంచుతున్న మహిళల పట్ల దురుసుగా కూడా ప్రవర్తిస్తారు.
స్త్రీలలో ఎక్కువ మందికి ఏదో ఒక సందర్భంలో పొత్తి కడుపు దగ్గర నెప్పి వస్తుంది. పొత్తి కడుపు అంటే నాభికి, జననాంగానికి మధ్య ఉన్న భాగం. అనేక మందిలో ఈ నొప్పి ఒక రోజులో తగ్గిపోతుంది, లేదా రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది.
చాలా తక్కువ మందికి మాత్రం అంటే ఒక శాతం కంటే తక్కువ మందికి ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి వారికి ఈ నెప్పి మళ్ళీ మళ్ళీ రావటమే కాక ఇబ్బందులను కలుగజేస్తుంది. మీకు కూడా ఎప్పుడన్నా ఈ నెప్పి రిపీటెడ్‌గా వస్తుంటే ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఏ ఏ పరిస్థితుల్లో వస్తోందో గమనించాలి.
పీరియడ్స్ సమయంలో..
మామూలుగా పీరియడ్స్ సమయంలో మహిళలకు పొట్ట కింది భాగంలో ఒకవైపు నొప్పి వస్తుంది. అండం విడుదల అయ్యే సమయంలో ఇది రావటం సహజం. అయితే ఉదరం కుడి వైపు భాగంలో నెప్పి వస్తుంటే మాత్రం మీరు కొంచెం జాగ్రత్త పడాలి. అవసరమైతే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది.
సెక్స్ సమయంలో నొప్పి...
స్త్రీలకు సెక్స్ సమయంలో నొప్పి, లేదా ఇతర రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ నొప్పి కేవలం ఏదో కొన్ని భంగిమలలో మాత్రమే వస్తూ వుంటే మీరు పట్టించుకోనవసరం లేదు. సెక్స్ పరంగా రిజిడిటీ వున్నా, ఉద్రిక్తత చెందకపోయినా కూడా ఇదే సమస్య వస్తుంది.
నొప్పి తీవ్రంగా ఉంటే..
ఎప్పుడూ జననాంగం వద్ద నెప్పిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫ్యామిలీ డాక్టర్కి ఈ విషయం చెప్పవలసి వుంటుంది. రుతుచక్రం సమయంలో నొప్పులు, ఆందోళనకరంగా ఫీలవడం మామూలే.
భరించలేనివిగా ఉన్నప్పుడు..
నొప్పులు ఇతర సమస్యలు విపరీతంగా, భరించలేనివిగా ఉంటే అది ఏదన్నా వ్యాధికి సంబంధిచినవి కావచ్చు అనేది గుర్తుంచుకోవాలి.