రతిక్రీడలో భావప్రాప్తికి సంబంధించి శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఓ బటన్‌ను నొక్కితే భావప్రాప్తి జరుగుతుందట. అమెరికాలో ఈ యంత్రానికి సంబంధించిన పేటెంట్ హక్కులు ఇచ్చారు. మహిళల్లో ఆర్గాజానికి సంబంధించిన లోపాలను నయం చేయడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది.
ఉత్తర కాలిఫోర్నియాలోని ఓ సరజ్న్ ఈ యంత్రానికి సంబందించిన ఆలోచనతో ముందుకు వచ్చారు. భావప్రాప్తికి సంబంధించిన సమస్యలకు ఈ యంత్రం ద్వారా చికిత్స చేయవచ్చునట. ఈ యంత్రంలో సిగరెట్ ప్యాకెట్‌కు కాస్తా చిన్నగా మెడికల్ ఇంప్లాంట్ ఉంటుంది.
ఆ యంత్రానికి సంబంధించిన వైద్య ప్రయోగాలు మిన్నేపోలిస్‌లో ఈ ఏడాది ఆఖరులో ప్రారంభం కావచ్చునని అంటున్నారు. కొంత మంది మహిళలు చాలా ఆర్గాజమ్ పొందుతారు. కానీ కొంత మంది మహిళలకు అది సాధ్యం కాదు. ఇటువంటి మహిళలకు ఆ యంత్రం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
బటన్ నొక్కితే చాలు..
అమెరికాలో పేటెంట్ హక్కులు పొందిన ఆ యంత్రం బటన్ నొక్కితే మహిళల్లో భావప్రాప్తి జరుగతుందని భావిస్తున్నారు.
కాస్తా నొప్పి
ఆ విధమైన ఆనందాన్ని, సుఖాన్ని పొందడానికి యంత్రం వాడినప్పుడు కాస్తా నొప్పి పుడుతుందని అంటున్నారు.
ఎలక్ట్రోడ్స్ ఉంటాయి..
యంత్రంలో అర్జాజం కలగజేసే సిగరెట్ ప్యాకేట్ కన్నా కాస్తా చిన్నగా ఇంప్లాంట్ ఉంటుంది. అది ఆర్గాజమ్ కోసం ఎలక్ట్రోడ్స్ను వాడుతుంది.
మహిళలకు చికిత్స
భావప్రాప్తి సమస్యతో బాధపడుతున్న మహిళలకు చికిత్స చేయడానికి బాక్స్ ఆఫ్ ట్రిక్స్ ఉపయోగపడుతుందని దాని సృష్టికర్త అంటున్నారు.
ఇది ఎలా ఉపయోగం..
సైకోథెరపీని సాధారణ చికిత్స పద్ధతిగా ఇప్పటి వరకు భావిస్తూ వస్తున్నారు. మరింత మానవ ప్రయత్నం ద్వారా ఈ ఇంప్లాంట్ చికిత్సకు ఉపయోగ పడుతుందని చెబుతున్నారు.
రోగి స్పృహలోనే ఉంటుంది...
ఇంప్లాంట్ను అమర్చడానికి చికిత్స చేసే సమయంలో రోగి స్పృహలోనే ఉంటుంది. రోగి వెన్నెముకలో ఎలక్ట్రోడ్స్ ఎక్కడ అమర్చాలనే విషయాన్ని సర్జన్ నిర్ధారిస్తాడు.
దాన్ని ఎక్కడ అమరుస్తారు..
దాన్ని సిగ్నల్ జనరేటర్కు కనెక్ట్ చేస్తారు. రోగి పిరుదుల చర్మం కింద దాన్ని అమరుస్తారు. అది సిగరెట్ ప్యాకెట్ కన్నా కాస్తా చిన్నగా ఉంటుంది.
రిమోట్ కంట్రోల్..
చేతిలో గల రిమోట్ కంట్రోల్తో ఇంప్లాంట్ బటన్ నొక్కితే భావప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. రోజుకు, వారానికి పలు సార్లు భావప్రాప్తికి అవకాశం కల్పిస్తుంది.
అయితే నిర్ధారణ కావాల్సే ఉంది..
ఆ యంత్రానికి సంబంధించిన వివరాలను నిర్ధారించాల్సే ఉంది. అందుకు గాను ఈ ఏడాది చివరలో ప్రయోగాలు ప్రారంభమవుతాయి. పురుషుల మీద కూడా ఈ యంత్రాన్ని ప్రయోగించి చూడాల్సి ఉంది.
అనుకోకుండా జరిగింది..
అనుకోకుండా నార్త్ కాలిఫోర్నియాకు చెందిన స్టార్ట్ మెలోయ్ ఈ యంత్రానికి సంబంధించిన ఐడియాను కనిపెట్టాడు. ఎలక్ట్రోడ్స్ ప్రవేశపెట్టినప్పుడు మహిళ మూలుగులు ప్రారంభించిందని, ఏమైందని తాను అడిగితే, తన భర్తను ఇలా చేయాలని అడగాలని మహిళ చెప్పిందని ఆయన వివరించారు.