దంపతులు సెక్స్ చేయడానికి ఇష్టపడే రోజు, సమయం విషయంలో ఓ సర్వే ఆసక్తికకరమైన విషయాన్ని వెల్లడించింది. శనివారం సాయంత్రం 7 గంటల 37 నిమిషాలకు రతిక్రీడ జరపడానికి చాలా మంది దంపతులు ఆసక్తి చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది.
సెక్స్ టాయ్ కంపెనీ లవ్‌హానీ నిర్వహించిన సర్వే ఆ విషయం తేలింది. ఆ సంస్థ 3 వేల మందిని ఎంపిక చేసుకుని సర్వే నిర్వహించింది. వారిలో 44 శాతం మంది దంపతులు ఆదివారాల కన్నా శనివారాలనాడే రతిక్రీడకు ఎక్కువ ఇష్టపడినట్లు తేలింది. ఆదివారంనాడు 24 శాతం మంది, శుక్రవారంనాడు 22 శాతం మంది రతిక్రీడకు ఆసక్తి చూపినట్లు తేలింది.
నిద్ర లేచే సమయంలో పురుషుల్లో కామవాంఛ ఎక్కువగా ఉంటుందని, కొన్నిసార్లు సాయంత్రం 4 గంటల 33 నిమిషాలకు ఆ కోరిక పుడుతుందని సర్వేలో తేలింది. అయితే, వివిధ కారణాల వల్ల ఆ సమయాల్లో వారు రతిక్రీడకు ఉపక్రమించరని తేలింది.
కోరికకు, అవకాశానికీ..
కామవాంఛ తీర్చుకోవాలనే కోరికకు, సమయానికి మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. కోరిక రగిలిన సమయ సందర్భాగాలు కుదరకపోవచ్చు.
తెల్లవారు జామున..
తెల్లవారు జామున పురుషుల్లో కామవాంఛ ఎక్కువగా రగులుతూ ఉంటుంది. అయితే, పని ఒత్తిడి కారణంగా రతిక్రీడకు పూనుకోరు. ఓ పది శాతం మంది మాత్రం అందుకు సిద్ధపడుతున్నారట.
ఎండాకాలమే రగిలిపోతారట..
కామవాంఛ వేసవికాలంలోనే ఎక్కువగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకే దాన్ని వసంతకాలమని అన్నారు. మూడింట రెండింతల మంది వేసవి కాలాన్ని చెప్పారు.
సమయం అనుకుని..
సమయం నిర్ణయించుకుని రతిక్రీడ సాగించడం అనేది అంత రోమాంటిక్గా ఉండదట. అయితే, పని ఒత్తిడి వల్ల అది తప్పడం లేదని అంటున్నారు. అయితే, సన్నిహితంగా మెలగడంద్వారా బంధాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.