•  

మగాడు ఇలా ఫ్లాటయిపోతాడు (పిక్చర్స్)

చాలా మంది మహిళలు బయటకు వెళ్లే ముందు తెగ అలంకరించుకుంటారు. తాము ఇష్టపడే పురుషుడి వద్దకు వెళ్లేటప్పుడు మరీ ఇదిగా అలంకరణపై శ్రద్ధ పెడుతారు. మహిళలు అలంకరణపై పెట్టే శ్రద్ధ ఇతర విషయాలపై పెట్టరనే అపవాదు కూడా ఉంది. అయితే, మీ పురుషుడి వద్దకు వెళ్లే సమయంలో తెగ ప్రత్యేక అలంకరణలు, ముస్తాబులు అక్కరలేదట.



మీ పురుషుడి వద్దకు అత్యంత సాధారణమైన రీతిలో వెళ్లాలని చెబుతున్నారు. అతి సాధారణమైన దుస్తుల్లో, కాస్తా కొట్టొచ్చేట్లు కనిపించే దుస్తుల్లో అతి మామూలు పద్ధతిలో అతని ఎదుట ప్రత్యక్షమైతే అతను తెగ సంతోషిస్తాడట.



బ్లౌజుకు, బ్రాకు మ్యాచ్ అయిందా, ప్యాంటీకి, చీరెకు మ్యాచ్ అయిందా అనేవి అతనికి పట్టవని అంటున్నారు. అతని వద్ద మీరు ఎలా ఉన్నారు, ఎంత క్యాజువల్‌గా ఉన్నారు, ఎంత ఉల్లాసంగా అరమరికలు లేకుండా వ్యవహరించారు అనేదే అతన్ని ఎక్కువగా ఆకర్షిస్తుందని అంటున్నారు.



మేకప్ అసలే వద్దు..

మేకప్ అసలే వద్దు..

ఎక్కువగా మేకప్ వేసుకుంటే అసాధారణంగా ఉంటుందని అంటున్నారు. కళ్లకు కాటుక దిద్దుకున్న విషయాన్ని, ముఖానికి పౌడరు దట్టించిన విషయాన్ని అతను పట్టించుకోడట. మీరు చూడడానికి కులాసాగా కనిపిస్తే చాలు.

 

లింగరీలు మ్యాచింగ్ పడుతుందా..

లింగరీలు మ్యాచింగ్ పడుతుందా..

మీ లింగరీలకు, బ్రాలకు మ్యాచ్ అయిందా, లేదా అనేది మీరు ప్రత్యేకంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం ఆలోచించకుండా ఉన్న ఫళాన పరుగెత్తుకొచ్చాననే రీతిలో వ్యవహరిస్తే అతను వెంటనే పడిపోతాడట.

 

జోక్స్ విసరండి..

జోక్స్ విసరండి..

మీ పురుషుడిని సంతోషపెట్టడానికి శారీరక కలయికే అవసరం లేదు. జోక్స్ విసరండి. హాయిగా నవ్వండి. ఉల్లాసంగా మాట్లాడండి. దానివల్ల అతను చాలా ఇదైపోతాడట.

 

కర్వీయే సెక్స్..

కర్వీయే సెక్స్..

జీరో సైజు వంటివి పురుషుడికి అవసరం లేదు. అత్యంత కష్టపడి సన్నబడడం లాంటివి కూడా అవసరం లేదు. మీ దేహం వొంపులు తిరిగి ఉంటే అతనికి ఎక్కువ ఇష్టమని అంటారు. నడుం వొంపు సొంపులకు అతను పడిపోతాడు.

 

ఆత్మవిశ్వాసం..

ఆత్మవిశ్వాసం..

మీలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడితే అతను ఎక్కువ మీ వైపు ఆకర్షితుడవుతాడు. తెలివి, భావోద్వేగంలో పరిణతి ప్రదర్శిస్తే అతను మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతాడు.

 

సాధారణంగా...

సాధారణంగా...

అత్యంత సాధారణమైన రీతిలో ప్రవర్తించండి. ప్రత్యేకంగా పనిగట్టుకుని కృత్రిమంగా కనిపించకూడదు. అతని కంపెనీలో సౌకర్యంగా ఫీలయ్యేట్లు ఉండాలి.

 

జట్టు తీర్చిదిద్దాలా..

జట్టు తీర్చిదిద్దాలా..

మహిళ తన పురుషుడి వద్ద పనిగట్టుకుని అత్యంత శ్రద్ధతో జుట్టును తీర్చిదిద్దుకుని ఉండాల్సిన అవసరం లేదు. జుట్టును ముడివేయకుండా వదిలేయవచ్చు. లేదంటే, అతి సాధారణమైన రీతిలో రబ్బర్ బ్యాండ్ బిగించి ముడి వేసుకోవచ్ేచు.

 

కళ్లతో కళ్లు కలిపి..

కళ్లతో కళ్లు కలిపి..

అనవసరమైన సిగ్గును ప్రదర్సించాల్సిన అవసరం లేదు. అతని కళ్లలోకి సూటిగా చూస్తూ మాట్లాడితే అతను ఎక్కువ ఇష్టపడుతాడు..

 

 

English summary

 Men are crazy. And they get crazier when they see you approach them in those red pumps and skinny jeans with a baggy and casual tee in style and confidence.
Story first published: Friday, October 11, 2013, 16:12 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras