ఆధునిక ప్రపంచంలో భార్యాభర్తలు కలిసి జీవించే సమయం కూడా చాలా తగ్గుతోంది. స్త్రీపురుషులు ఇరువురు క్షణం తీరిక లేకుండా వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కూరుకుపోయి, ఒకరినొకరు పట్టించుకునే సమయం కూడా కరవు అవుతోంది. దీనివల్ల శృంగార జీవితం అటకెక్కి దాంపత్య జీవనం కూడా దెబ్బ తింటోంది.
స్పీడ్‌లో కొట్టుకుపోవడమే అవుతోంది తప్ప కాస్తా ఆగి ఆలోచించుకునే సమయం కూడా ఉండడం లేదు. ఒకరినొకరు పట్టించుకుని, ఆప్యాయతతో ఉల్లాసంగా గడిపే సమయాలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో ఇరువురి మధ్య బంధం బలహీనపడుతోంది. అపార్థాలు, అనుమానాలు పెరిగిపోయి సంబంధాలు బలహీనపడుతున్నాయి.
శృంగార జీవితం ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే దాంపత్య జీవితం అంత సుఖమయం అవుతుంది. తీరిక చేసుకుని దంపతులు రతిక్రీడకు కాస్తా సమయం ఇస్తే మంచిది. లైంగిక పటుత్వం పెంచుకోవడానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ఆరు గంటలు నిద్ర..
ఎన్ని పనులున్నప్పటికీ రోజుకు కనీసం ఆరు గంటల పాటు నిద్రపోవాలి. అంతరాయం లేని నిద్ర మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. అలసిపోయిన శరీరం తిరిగి ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది.
వ్యాయామం తప్పనిసరి..
ప్రతి రోజూ ఓ గంట పాటు వ్యాయామం చేయాలి. వాకింగ్, స్విమ్మింగ్, షటిల్ వంటి వ్యాయామాలు మంచివి. ధ్యానం కూడా మీ లైంగిక శక్తిని పెంచుతుంది.
ఈ ఆహార పదార్థాలు తినాలి
మారిన జీవన శైలికి అనువుగా వైద్య నిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రూట్, ఓట్స్ శక్తినిస్తాయని చెబుతున్నారు. మసాలాలు, ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుందని చెబుతున్నారు. చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల పరిశోధనలో తేలింది.
సామూహికంగా ఇలా..
సన్నిహిత మిత్రులతో ఉల్లాసంగా గడపాలి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవడంతో ఒంటరితనం పెరుగుతోంది. అందుకే వారానికి ఓ సారైనా పార్కులకు, రెస్టారెంట్లకు వెళ్లి మిత్రులతో కలిసి మెలిసి ఉల్లాసంగా ఉండేలా చూసుకోవాలి.
పరస్పర విశ్వాసం ముఖ్యం..
దంపతుల మధ్య పరస్పర విశ్వాసం ముఖ్యం. భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలకు తావులేకుండా చూసుకోవాలి. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై లైంగిక ఆసక్తి తగ్గుతుంది. మనసు విప్పి మాట్లాడుకో వడం వల్ల జీవితం సుఖమయమవుతుంది.
తగిన మోతాదులో మద్యం
తగిన మోతాదులో మద్యం సేవిస్తే సెక్స్ భయాలు పోయి హాయిగా సెక్స్లో పాల్గొనవచ్చు. ఎక్కువ మద్యం సేవిస్తే మొదటికే మోసం వస్తుంది.