దాంపత్య జీవితం బాగుండాలని చాలా మంది దంపతులు కోరుకుంటారు. ఆనందంగా, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తుంటారు. కానీ అది వారు అనుకున్నట్లు సాగకపోయే సరికి నిరాశ, అసంతృప్తి చెందుతారు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే సరికి పరిస్థితి దాటిపోతుంది. భార్యాభర్తల మధ్య శృంగార క్రీడ ఆరోగ్యకరంగా ఉంటే దాంపత్యం కూడా ఆనందంగా ఉంటుంది.
భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం ఇరువురి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. శారీరక సాన్నిహిత్యం మానసిక సాన్నిహిత్యానికి పునాదులు వేస్తుంది. రతిక్రీడలో భార్యాభర్తలు ఇరువురు సంతోషంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించక తప్పదు.
రతిక్రీడలో ఒకరి మననుసు ఒకరు ఎరిగి, ఒకరి పట్ల ఒకరు అనురాగం ప్రదర్శించి, ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇచ్చి సాగిస్తే ఆనందానికి అవధులు ఉండవు. శృంగార క్రీడలో దంపతులిద్దరికీ అవగాహన కుదిరితే అదే అవగాహన దాంపత్య జీవితంలోనూ కొనసాగుతుంది. రతిక్రీడను ఆనందం చేసుకోవడానికి నిపుణుల అభిప్రాయాలు చూద్దాం.
పరస్పర అవగాహన
ప్రధానంగా ఒకనొకరు అర్థం చేసుకోవాలి. ఇరువురు మనస్సులోని భావాలను స్వేచ్ఛగా వెల్లడించుకోవాలి. మనస్సులోని కోర్కెలను చెప్పుకోవాలి. దానివల్ల ఇరువురి మధ్య అవగాహన పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
ఆరోగ్య సూత్రాలు...
రతిక్రీడ విషయంలో స్త్రీపురుషులు కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా పాటించాలి. నోటి దుర్వాసన రాకుండా చూసుకోవాలి. దుర్వాసన వల్ల ముద్దు పెట్టుకునే సమయంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించాలంటే పడక మీదకు చేరే ముందుగా దంతాలను శుభ్రం చేసుకోవడం మంచిది.
మద్యానికి దూరం..
రాత్రి పూట పడక గదికి చేరే ముందు మద్యం సేవించరాదు. దీనివల్ల భాగస్వామి ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. నీరుల్లిపాయ, వెల్లుల్లిపాయ వంటి ఘాటైన వాసన కలిగిన పదార్థాలను తినక పోవడం మంచిదని చెబుతారు.
చెమట మంచిది కాదు..
అధికంగా చెమట పట్టి జిడ్డోడుతున్న శరీరంతో పడక మీదికి ఎక్కితే భాగస్వామికి ఇబ్బందిగానే ఉంటుంది. చెమట వల్ల వచ్చే దుర్వాసన కూడా శృంగారానికి ఇబ్బందిగా పరిణమిస్తుందని నిపుణులు చెపుతున్నారు. పడకమీదికి చేరుకునే ముందు స్నానం చేసి, కాస్తా సుగంధ ద్రవ్యాలను వాడితే మంచిదని అంటారు.
వ్యక్తిగత శుభ్రత
శరీరం శుభ్రంగా ఉంటే, రతిక్రీడకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. జననాంగాలు కూడా శుభ్రంగా ఉంటే రతి మరింత ఆనందంగా ఉంటుంది.