•  

ఫొటోలు: సెక్స్‌లో హీటెక్కి దంచికొట్టడమెలా..

శృంగార జీవితం ఆనందంగా ఉంటేనే దాంపత్య సుఖం అందుతుంది. రొటీన్ సెక్స్ పురుషులకు, స్త్రీలకు విసుగు పుట్టిస్తుంది. చిరాకుగా కూడా ఉంటుంది. రతిక్రీడను కొత్తగా అనుభవించడం వల్ల రోజువారీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మొక్కుబడి వ్యవహారంగా లైంగిక క్రీడ సాగితే అది రుచిపచిని కోల్పోతుంది. ఆధునిక యువత శృంగార జీవితం పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్లు చెబుతున్నారు.



సామర్థ్యం, ఉత్సాహం ఉన్నా రతిక్రీడ సాధారణ వ్యవహారంగా సాగితే విసుగ్గానే ఉంటుంది. ఓపిక కూడా నశిస్తే అది మరింత దారుణంగా ఉంటుంది. సంపాదనకే కాకుండా, రతిక్రీడకు కూడా కొంత సమయం వెచ్చిస్తే జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. ఎప్పుడూ పని గురించి, సంపాదన గురించి ఆలోచిస్తూ కొంత మంది లైంగిక జీవితానికి అంత ప్రాధాన్యం ఇవ్వరు. దీనివల్ల భాగస్వామిలో విసుగు పుడుతుంది.



పురుషుడు లేదా మహిళ తమ జీవితాలు ఉల్లాసంగా ఉండాలంటే రతిక్రీడను ఓ కళగా అభ్యాసం చేయాలి, ఆచరించాలి. వారానికి ఓసారో, రెండు సార్లో కాకుండా నిత్యం రతిక్రీడను మీకిష్టమైన రీతిలో అనుభవించడానికి ప్రయత్నించండి. శృంగార జీవితం నిత్యనూతనంగా ఉండడానికి మధ్య మధ్యలో వీలునప్పుడు, వీలు చేసుకుని కొన్ని కొత్త పద్ధతులు అవలంబించండి.



కలిసి జలకాలాట..

కలిసి జలకాలాట..

భాగస్వామితో కలిసి వేడినీళ్ల స్నానం చేస్తే ఆ హాయి చెప్పనలవి కానిది. మధురోహలు ముంచెత్తి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెరుగుతుంది. ఒకరినొకరు స్నానం చేయించుకోవడం ద్వారా, సబ్బులు రుద్దుకోవడం ద్వారా చిలిపి చేష్టలతో ఆనందించవచ్చు.

 

కలిసి భోజనం చేయడం..

కలిసి భోజనం చేయడం..

భాగస్వాములు ఇద్దరు పరస్పరం వడ్డించుకుంటూ భోజనం చేస్తే అది తదుపరి శారీరక సుఖాన్ని జుర్రుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇద్దరి మనసులు ఒక్కటి కావడమే కాకుండా శరీరాలు ఒక్కటి కావడానికి తహతహలాడుతాయి. ఆ సమయంలో పారదర్శకమైన దుస్తులు ధరిస్తే ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణ పెరుగుతుంది.

 

అతనిపై ధ్యాస పెట్టండి..

అతనిపై ధ్యాస పెట్టండి..

ఆఫీసుకు వెళ్లేటప్పుడు గానీ బయటకు వెళ్లేటప్పుడు గానీ ప్రత్యేకంగా వ్యవహరిస్తే, తన పట్ల మీకు గల ఆసక్తిని తెలిపే విధంగా వ్యవహరిస్తే మళ్లీ తిరిగి వచ్చే వరకు ఆ పురుషుడి గురించే మహిళ ఆలోచిస్తుంది. రాగానే వాటేసుకుందామనే కోరికతో ఎదురు చూస్తూ ఉంటుంది. బయటకు వెళ్లేముందు ఆమె తొడపై చెయ్యి వెయ్యడం, చెవిలో సెక్సీ మాటలతో గుసగుసలాడటం, వారి మెడ భాగంలో ముద్దు పెట్టడం వంటి చర్యలు చేయడం వల్ల ఆ జ్ఝాపకాలతో మహిళ మీ కోసం వేచి చూస్తూ ఉంటుంది.

 

దీర్ఘ, గాఢ చుంబనం :

దీర్ఘ, గాఢ చుంబనం :

తొలినాళ్లలో ఎలా మీ మహిళా భాగస్వామి పట్ల వ్యవహరించారో గుర్తు చేసుకుని, ఆమె ఎడబాటును సహించలేను అన్నట్లుగా గాఢంగా ముద్దు పెడితే అది తీపి జ్ఝాపకంగా ఉండిపోయి రాత్రి పడకగదిని ఊపేయడానికి ఉపయోగపడుతుంది. తరుచుగా ముద్దులు పెట్టడం ద్వారా భాగస్వామికి స్త్రీ అయినా పురుషుడైన దగ్గరవుతారు.

 

శృంగార చిలిపి సందేశాలు

శృంగార చిలిపి సందేశాలు

మీ భాగస్వామిని రోజంతా మీ గురించే ఆలోచించేలా చేయడానికి కొత్త కొత్త సందేశాలను కనిపెట్టండి. దాన్ని వివిధ పద్ధతుల్లో వ్యక్తం చేస్తూ అతని పట్ల లేదా ఆమె పట్ల తనకు విపరీతమైన ఆసక్తి ఉందని తెలియజేసే విధంగా ఉండాలి.

 

ఒకరికొకరు తినిపించుకుంటూ..

ఒకరికొకరు తినిపించుకుంటూ..

ఆహార పదార్థాలే కాదు, పండ్లు ఫలాలు, తినుబండారాలు ఒకరికొకరు తినిపించుకోవడం ద్వారా శృంగార భావనలు మోసులు వేస్తాయి. గోరుముద్దలు కూడా తినిపించుకోవచ్చు. చిన్న పిల్లాడినో, చిన్నపిల్లనో చేసినట్లు ఆడిస్తూ, ఉడికిస్తూ తినిపించుకుంటే ఇంకా అనురాగం వెల్లి విరుస్తుంది.

 

శరీర మర్ధనతో కోరికలు..

శరీర మర్ధనతో కోరికలు..

పరస్పరం శారీరక మర్దనకు దిగితే కామవాంఛలు బుసకొట్టి, వెంటనే ముగ్గులోకి దిగిపోతారు. బాడీ మసాజ్ స్త్రీపురుషులను మత్తులోకి దింపుతుంది. మర్ధనలో నైపుణ్యాలను కూడా పాటించవచ్చు. పాదాల వద్ద నుంచి మొదలు పెట్టి మెల్లగా మీదికి వెళ్తూ సంభోగం చేసుకునే స్థాయికి తీసుకుని వెళ్లవచ్చు.

 

శృంగార గాధలు

శృంగార గాధలు

శృంగారానికి సంబంధించిన కథలను వినిపించడం ద్వారా భాగస్వామిని మీ వైపు ఆకర్షించవచ్చు. ఆసక్తి కలిగించే విధంగా శృంగార రసప్లావితమైన ముచ్చట్లు మిమ్మల్ని మన్మథ సామ్రాజ్యంలోకి తీసుకుని వెళ్తాయి.

 

ఫోన్ మెసేజ్‌లు

ఫోన్ మెసేజ్‌లు

గత రాత్రి లైంగిక క్రీడ మిమ్మల్ని ఎంతగా ఆనందింపజేసిందో, మళ్లీ అటువంటి అనుభవానికి మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుపుతూ మెసేజ్‌లు పెట్టండి. మీ భాగస్వామి సాన్నిహిత్యాన్ని మీరు ఎంతగా కోరుకుంటున్నారో తెలియజేస్తూ సందేశాలు పంపండి.

 

కొత్త భంగిమలతో కొత్త రుచులు

కొత్త భంగిమలతో కొత్త రుచులు

ఒక రకమైన భంగిమ విసుగు పుట్టిస్తుంది. ఆనందాన్ని తనివితీరా అందుకోలేరు. అందువల్ల కొత్త రతి భంగిమలను ఆచరించండి. సమయాన్ని బట్టి సుదీర్ఘంగా వివిధ భంగిమలను ఒకే రాత్రి ఆచరించి, ఆనందాన్ని జుర్రుకోవచ్చు. కొత్త భంగిమలను తెలిపే పుస్తకాలను కలిసి చదువుతూ ప్రయోగాత్మకంగా వాటిని ఆచరించవచ్చు.

 

 

English summary
Couple should spice up their sexual drive to make sexual life happy and more romantic.
Story first published: Wednesday, August 21, 2013, 13:38 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras