•  

పిక్చర్స్: ఆమెకు మగాడు ఎలా ఉండాలి..

ఆడవాళ్ల మనసును పసిగట్టడం సాధ్యం కాదంటారు. ఆమెలో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉంటాయని చెబుతుంటారు. తన నుంచి తన మహిళ ఏం కోరుకుంటుందనే విషయాన్ని పసిగట్టడంలో పురుషుడు తబ్బిబ్బవుతుంటాడు. ఏదీ సూటిగా చెప్పదు కానీ అతని నుంచి ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటుంది.రతిక్రీడ లేదా శృంగారం ఆమెకు కేవలం దేహానికి సుఖాన్ని ఇచ్చే కార్యం మాత్రమే కాదు, బంధాన్ని పటిష్టం చర్య కూడా. మహిళలు మెచ్చేలా ఉండడానికి పురుషులు ప్రయత్నిస్తుంటారు. తన మహిళను సంతోషపెట్టాలని నిరంతరం శ్రమిస్తుంటాడు.మహిళలు ఎలాంటి పురుషులను ఇష్టపడతారనే విషయాన్ని చెప్పడం కూడా కష్టమే. మహిళలు సాధారణంగా తమ అభిప్రాయాలను సూటిగా చెప్పరు. కానీ, ఎలాంటి పురుషులు ఆకర్షణీయంగా ఉంటారో వారికి తెలుసు. వారు మెచ్చితే అతని పంట పండినట్లే.సూపర్ మ్యాన్

సూపర్ మ్యాన్

తన పురుషుడు సిక్స్ ప్యాక్ బాడీని పెంచాలని ఏ మహిళ కూడా కోరుకోదు. కానీ శక్తిమంతుడై ఉండాలని కోరుకుంటుంది. అతని శారీరక దార్ఢ్యతను ఇష్టపడుతుంది. బలహీనంగా ఉండే పురుషులను మహిళలు అంతగా ఇష్టపడరు. తనకు రక్షణ ఇస్తాడనే నమ్మకం కలిగించేలా అతని దేహ పటిష్టత ఉండాలంటారు.

 

సువాసన వెదజల్లాలి..

సువాసన వెదజల్లాలి..

పురుషుడు శుభ్రంగా కనిపిస్తే మహిళ ఇష్టపడుతుంది. పురుషుడి దేహం నుంచి మంచి వాసన రావాలి. దుర్వాసన వెదజల్లే వాసనను ఆమె ఇష్టపడదు. అయితే, సుగంధ పరిమళాలను గుప్పించుకుని సువాసనలు వెదజల్లాలని కూడా ఏమీ కోరుకోదు.

 

ఆశ్చర్యపరచాలి..

ఆశ్చర్యపరచాలి..

తన పురుషుడు తనను ఆశ్చర్యపరచాలని మహిళ కోరుకుంటుంది. ఆమె మనసును బట్టి ఆమెకు బహుమతులను అందించి ఆశ్చర్యపరచవచ్చు.

 

దాపరికాలు కూడదు..

దాపరికాలు కూడదు..

తన నుంచి పురుషుడు ఏదో దాస్తున్నాడని అనుమానిస్తే మహిళ అసలు ఇష్టపడదు. నిజాయితీని కోరుకుంటుంది. నువ్వు చెప్పేవన్నీ నిజాలే అనే విధంగా ఉండాలి. నువ్వు తన నుంచి ఏమీ దాచడం లేదనే అభిప్రాయం కలిగించాలి.

 

పొందికైన శరీరం

పొందికైన శరీరం

పొందికైన శరీరం గల పురుషుడిని మహిళ ఎక్కువగా ఇష్టపడుతుంది. పురుషుడి శరీరం తీర్చిదిద్దినట్లు ఉండాలని అనుకుంటుంది. నిత్యం వ్యాయామం చేస్తే పురుషుడి శరీరం ఆకర్షణీయంగా మారుతుంది.

 

మంచి దుస్తులు ధరించాలి..

మంచి దుస్తులు ధరించాలి..

తన పురుషుడు ధరించే దుస్తులు హుందాగా కనిపించడానికి తోడ్పడాలని అనుకుంటుంది. ఎక్కువ ఆకర్షణీయంగా కాకుండా హుందా ఉట్టిపడేలా ఉండాలని కోరుకుంటుంది. మంచి దుస్తులు ధరించి పురుషుడు తన మహిళ మనసును దోచుకోవచ్చు.

 

మంచి హెయిర్ స్టయిల్..

మంచి హెయిర్ స్టయిల్..

మంచి హెయిర్ స్టయిల్‌ను మహిళ ఇష్టపడుతుంది. మిగతా వాళ్ల కన్నా నువ్వు భిన్నంగా ఉన్నట్లు కనిపించాలి. జుట్టు శుభ్రంగా ఉండాలి.

 

చేతులతో మంత్రం..

చేతులతో మంత్రం..

మీ చేతులు శుభ్రంగా ఉంచుకుని, ఏ రెస్టారెంట్‌కో తీసుకెళ్లినప్పుడు వంటకాలను వడ్డిస్తుంటే ఆమె ముచ్చటపడుతుంది. అటువంటి సందర్భాలను ఆమె మరిచిపోదని అంటారు.

 

 

English summary
Someone once said 'To generalize on women is dangerous. To specialize on them is infinitely worse'.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras