మహిళల లైంగికత, కామవాంఛ గురించి శాస్త్రీయ పరిశోధన కూడిన ఓ పుస్తకం దిమ్మ తిరిగే విషయాలను బయటపెట్టింది. ఇప్పటి వరకు మహిళల లైంగికత, కామవాంఛ గురించిన ఆలోచనలన్నీ తప్పేనని తేల్చేసింది. మహిళలు శృంగార క్రీడలో పురుషులకు ఏ మాత్రం తీసిపోరని, సాంస్కృతిక ఆదర్శాలు ఆమె లైంగిక క్రీడాసక్తిని తగ్గించి, రూపుదిద్దిందని ఆ పుస్తక రచయిత డైనియల్ బెర్గనర్ అంటున్నారు.
జర్నలిస్టు బెర్గనర్ 'వాట్ వుమెన్ వాంట్: అడ్వెంచర్స్ ఇన్ ద సైన్స్ ఆఫ్ అడ్వెంచర్స్' అనే పుస్తకంలో ఆశ్చర్యం గొలిపే విషయాలను బయటపెట్టారు. మహిళలతో లైంగిక క్రీడ జరిపే పురుషులకు గుబులు పుట్టించే విషయాలను ఆయన చెప్పారు. సాంస్కృతిక పరిమితుల్లో మహిళల లైంగికతను, కామవాంఛను తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పారు.
సాంస్కృతిక కట్టుబాట్లు మహిళల లైంగిక వాంఛను అణచేసి, తిరిగి రూపు దిద్దిందని ఆయన అంటున్నారు. పురుషుల మాదిరిగానై లైంగికత విషయంలో మహిళలు ఆకలి గొన్న జంతువులని ఆయన అన్నారు. సంప్రదాయబద్దంగా మహిళలకు సమాజం కొన్ని ప్రమాణాలను నిర్దేశించిందని రచయిత అన్నారు. మహిళలు రతిక్రీడలో ముందడుగు వేయరని, పురుషులు మాత్రమే దూకుడుగా వ్యవహరిస్తారనే నమ్మకం తప్పు అని ఆయన అన్నారు. సామాజిక కట్టుబాట్ల కారణంగా ఆ అభిప్రాయం బలపడిందని అంటున్నారు.
రతిక్రీడ విషయంలో పురుషులు దూకుడుగా వ్యవహరిస్తారని మహిళలు అంత శక్తివంతులు కాదనే అభిప్రాయం తప్పని పరిశోధకుడు బెర్గనర్ అంటున్నారు. మహిళల సెక్సువాలిటీపై ఆయన పుస్తకం ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టింది.
మహిళల లైంగికతను, కామవాంఛను సామాజిక కట్టుబాట్లు అణచివేశాయని, వాటిని రూపుదిద్దాయని రచయిత అంటున్నారు. సంప్రదాయాల కారణంగా మహిళలు తమ లైంగికతను బయటపెట్టలేని వాతావరణం ఉందని చెప్పారు.
అత్యంత దూకుడుగా, వేగంగా వ్యవహరించే జంతువుల మాదిరిగా మహిళలు వ్యవహరించగలరని రచయిత చెప్పారు. వారిలో తీవ్రమైన కామవాంఛలు, చర్యలు ఉంటాయని చెప్పారు.
పురుషులకు ఇచ్చిన స్వేచ్ఛ మహిళలకు లేదు. ఆ స్వేచ్ఛ గనుక మహిళలకు ఉంటే పురుషులు దిగదుడుపేనని రచయిత అంటున్నాీరు.
'వాట్ వుమెన్ వాంట్: అడ్వెంచర్స్ ఇన్ ద సైన్స్ ఆఫ్ ఫిమేల్' అనే పుస్తకంలో చెప్పితే గానీ మహిళలకు తమ సత్తా ఏమిటో వారికి తెలియదని అంటున్నారు.
సామాజిక కట్టుబాట్ల కారణంగా మహిళల ఉద్వేగాలు అణచివేతకు గురయ్యాయని రచయిత అన్నారు. సంస్కృతిబంధనాలకు వారు భయపడుతారని చెప్పారు. సామాజిక కట్టుబాట్లు, సంప్రదాయాల కారణంగా వారి లైంగిక ఉద్వేగాలు సమసిపోతాయని చెప్పారు.
మహిళలకు సామాజిక కట్టుబాట్లు అడ్డు రాకపోతే, సంప్రదాయాల కారణంగా తప్పుడు అవగాహనకు గురి కాకుండా ఉంటే మహిళల కామవాంఛ, లైంగికత భిన్నంగా ఉండేదని రచయిత అన్నారు.
మహిళలు ప్రస్తుతం నిజమైన ఉద్వేగాలను మాత్రమే వ్యక్తీకరించగలరని, రతిక్రీడ గురించి వెల్లడించలేరని అంటున్నారు.
లైంగిక క్రీడ విషయంలో పురుషులు మాత్రమే చొరవ ప్రదర్శిస్తారనే అభిప్రాయం బలంగా ఉంది. అది తప్పని బెర్గనర్ చెప్పారు.