కదలికల ద్వారా, హావభావాల ద్వారా వ్యక్తి చెప్పే మాటల్లోని విషయాలను గ్రహించవచ్చునని అంటున్నారు. బాడీ లాంగ్వేజ్‌ను బట్టి ఎదుటి వ్యక్తుల ఆంతర్యాన్ని గ్రహించవచ్చు. చేతులు కట్టుకుని నిలబడితే అతనూ పూర్తిగా ఆత్మరక్షణలో ఉన్నట్లు అర్థమని చెబుతారు. ముక్కునో, చెవి వెనక బాగాన్నో చేతులతో రాసుకుంటే అతను అబద్ధాలు చెబుతున్నాడని అర్థం.
పడక గదిలో కూడా మీ భాగస్వామి చేష్టలను బట్టి, శరీర కదలికలను బట్టి అతను లేదా ఆమె కోరుకుంటున్నారో పసిగట్టవచ్చు. ఆమె లేదా అతని ఆంతర్యాన్ని బట్టి, చేతలను బట్టి ముందుకు సాగితే పడకగది రాత్రిపూట వెలిగిపోతుందని అంటున్నారు.
మీ భాగస్వామి మనసును గ్రహించి ముందుకు అడుగు వేయడం వల్ల రతిక్రీడను బాగా ఆనందించవచ్చునని కామశాస్త్ర నిపుణులు అంటున్నారు. మీ భాగస్వామి కదలికలు ఏ సందర్భంలో ఎలా ఉంటాయో చూద్దాం..
మీ భాగస్వామి మీ చుట్టూ లేదా మీ వెంటే తిరుగుతుంటే ఆమె లేదా అతని దేహం వేడెక్కుతోందని, కామవాంఛ రగులుతోందని గ్రహించాలని. దాన్ని గ్రహించి మీ భాగస్వామిని చేతుల్లోకి తీసుకుంటే పడకగది ఊగిపోతుంది.
మీ భాగస్వామి మీకు చాలా దగ్గరగా లేదా మిమ్మిల్ని తాకుతూ నిలుచుంటే మీకు మరింత దగ్గర కావాలని అనుకుంటున్నట్లు, మీ శరీరంతో తన శరీరాన్ని ఏకం చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పవచ్చు.
మీ భాగస్వామి మీలాగే ఫోజులు ఇస్తున్నా, మీలాగే శరీర భంగిమలను పెడుతున్నా మీలాగే ఆలోచిస్తున్నానని చెప్పడానికని గ్రహించాలి. తద్వారా నువ్వు నేనూ ఒక్కటే ఏకమవుదామనే సంకేతాలు ఇస్తున్నట్లు అనుకోవచ్చు.
కంటి రెప్పలు కొట్టకుండా పురుషుడు మహిళ వైపు తదేకంగా చూస్తుంటే ఆమె పడిపోతుందని అంటారు. మీ భాగస్వామి మీ వైపు తదేకంగా చూస్తుంటే మిమ్మల్ని కోరుకుంటున్నట్లు, మీలో శృంగార భావలను రగులుకొల్పాలని చూస్తున్నట్లు చెప్పవచ్చు.
మిమ్మల్ని మీ భాగస్వామి స్పర్శిస్తుంటే మీ పట్ల జాగ్రత్త తీసుకుంటున్నట్లు గ్రహించాలి. దాన్ని అలాగే వదిలేయవద్దు. ప్రతిస్పందనగా మీరు కూడా అటువంటి చర్యకే దిగాలి. దానివల్ల ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
మీ భాగస్వామి జుట్టును దువ్వుకోవడమో, దుస్తులను సరి చేసుకోవడమో చేస్తున్నారంటే మీకు అందంగా కనిపించాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పవచ్చు. దానికి తగిన ప్రతిక్రియ ఉండాలి.
మీరు ఆలోచిస్తున్నారో మీ భాగస్వామితో పడకగదిలో చెప్పండి. చేతులతో మీ భాగస్వామి చేతులను, పొట్టనో, ఛాతీనో స్పర్సించడం వంటి చర్యకు దిగితే మీ పట్ల ఆసక్తి ప్రదర్సిస్తున్నట్లు చెప్పవచ్చు.