వ్యక్తిలో సెక్స్ కోరికలు సన్నగల్లితే చిరాకుగాను, ఆందోళనగానూ ఉంటుంది. డిప్రెషన్, శారీరక అస్తవ్యస్తత వంటి సమస్యలు తలెత్తుతాయి. మీ భాగస్వామిలో కూడా ఇవే సమస్యలు తలెత్తుతాయి. దైనందిన జీవితంలో మార్పులు చేసుకోవడం ద్వారా, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా వాటిని సరిచేసుకోవచ్చు. అసలు మీ కామవాంఛ ఎందుకు అడుగంటిందనేది ముందు తెలుసుకోవడం ముఖ్యం. కామవాంఛ తగ్గడానికి గల కొన్ని కారణాలను చూడండి.
అంగస్తంభన జరగకపోవడం - అంగస్తంభన జరగడం లేదనే అపోహ పురుషుల్లో కలుగుతూ ఉంటుంది. నలభై ఏళ్ల వయసు పైబడిన వారికి సాధారణంగా ఈ సమస్య వస్తుంది. చాలామంది దీన్ని మానసిక సమస్యగా భావిస్తారు. పరిష్కారం కాదని వదిలేస్తారు.కాని కొన్ని మందులతోను, వైద్య విధానాలతోను ఈ సమస్యను చక్కగా అధిగమించవచ్చు.
మెనోపాజ్ - ఇది మహిళలలో వచ్చే శారీరక మార్పు. దీని కారణంగా వారికి కామ వాంఛ తగ్గుతుంది. హార్మోన్ల విడుదల తగ్గి యోని పొడిబారి రతి సమయంలో నొప్పిని కలిగిస్తాయి. దానివల్ల భావ ప్రాప్తి పొందడానికి కూడా సమయం పడుతుంది. అయినప్పటికి భాగస్వామి సహకారంతో ఈ సమస్యను కొంత మేరకు అధిగమించవచ్చు.
డిప్రెషన్ - తరచుగా యాంటీ డిప్రెషన్ మందులు వాడితే కామవాంఛ తగ్గిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి వెంటనే వైద్య సలహాలు సరైన మందులు అవసరంగా వుంటుంది.
నిద్ర లేమి - నిద్రకు కామవాంఛకు సంబంధం ఉంటుందని కామశాస్త్ర నిపుణులు తేల్చారు. రోజూ సరిగా నిద్రించకపోవడం వల్ల, వారానికో సారి అధికంగా నిద్రపోవడం వల్ల కూడా కామవాంఛ తగ్గుతుందని నిపుణులు చెప్పారు. దీనికి కారణం ఒత్తిడినిచ్చే హార్మోన్లు శరీరంలో పెరుగుతాయి. అందువల్ల ప్రతిరోజూ తగినంత సమయాన్ని నిద్రకు కేటాయించడం మంచిది.
పిల్లల సంరక్షణ - పిల్లల సంరక్షణలో మీ శారీరక, మానసిక ఆరోగ్యాలు దిగజారవచ్చు. పిల్లల సంరక్షణలో పడి మీ వాంఛలను మరచిపోతారు. భాగస్వామిని అశ్రద్ధ చేస్తారు. పిల్లలకు ఒక ఆయాను పెట్టటం లేదా బేబీ నిద్రించే సమయంలో పది నిమిషాల వర్కవుట్లు కానిచ్చేయటం వంటివి చేయాలి.