•  

మీలో కామవాంఛ తగ్గుతోందా, దేనికి గుర్తు?

Reasons for decreasing in Romance
 
సుఖవంతమైన దాంపత్య జీవితంలో శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మహిళల్లో గానీ పురుషుల్లో గానీ సెక్స్ కోరికలు అడుగంటితే చిరాగ్గానూ విసుగ్గానూ ఆందోళనగానూ ఉంటుంది. భాగస్వామిని కూడా అది సమస్యల్లోకి నెడుతుంది. జీవన శైలిని సరిచేసుకోవడం ద్వారా మీరు ఈ సమస్యలను తేలికగా అధిగమించవచ్చు. అసలు మహిళల్లో గానీ పురుషుల్లో గానీ కామ వాంఛ ఎందుకు అడుగంటిందనేది తెలుసుకోవడం అవసరం. కామవాంఛను చంపేసే కొన్ని మానసిక, శారీరక సమస్యలు చూడండి.



అంగస్తంభన జరగకపోవడం - అంగస్తంభన సరిగా జరగడం లేదని భావిస్తున్నారంటే మీకు సైరన అవగాహన లేకపోవడమేనని గుర్తించాలి. నలభై సంవత్సరాల వయసు పైబడిన వారికి సాధారణంగా ఈ సమస్య వస్తుంది. చాలామంది దాన్ని వయస్సుతో వచ్చిన సమస్యగా భావించి పరిష్కరించేదికాదని వదిలేస్తారు. కాని కొన్ని మందులతోను, వైద్య విధానాలతోను ఈ సమస్యను చక్కగా అధిగమించవచ్చు. అది మానసికమైన సమస్య కూడా. మనసును శృంగారం వైపు మళ్లించడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు.



మెనోపాజ్ - ఇది మహిళలలో వచ్చే శారీరక మార్పుల కారణంగా వారికి కామ వాంఛ వెనుకబడుతుంది. తగ్గిన హార్మోన్లు యోని పొడిబారి రతి సమయంలో నొప్పిని కలిగిస్తాయి. ఈ కారణంగా భావ ప్రాప్తి పొందడానికి కూడా సమయం పడుతుంది. అయినప్పటికి భాగస్వామి సహకారంతో కొంతమేర అధిగమించవచ్చు.



డిప్రెషన్ - తరచుగా యాంటీ డిప్రెషన్ మందులు వాడితే కూడా కామవాంఛ తగ్గిస్తుంది. డిప్రెషన్, దానికి వాడే మందులు కూడా వాంఛ తగ్గించటంతో వీరికి వెంటనే వైద్య సలహాలు సరైన మెడిసిన్ అవసరంగా వుంటుంది.



నిద్ర లేకపోవడం - నిద్రకు కామ వాంఛకు సంబంధం వుందని పరిశోధకులు తెలుపుతారు. మీరు ప్రతిరోజూ సరిగా నిద్రించక, మీ నిద్రను వారానికోసారిగా అధికంగా పోతున్నట్లయితే కూడా మీలో కామ వాంఛ తగ్గిపోతుంది. దీనికి కారణం ఒత్తిడినిచ్చే హార్మోన్లు శరీరంలో పెరగటం. కాబట్టి ప్రతిరోజూ తగినంత సమయాన్ని నిద్రకు కేటాయించి, అవసరమైన హార్మోన్ల స్ధాయి ఉండేలా చూసుకోవచ్చు.



పిల్లల సంరక్షణ - పిల్లల సంరక్షణలో మీ శారీరక, మానసిక ఆరోగ్యాలు దిగజారవచ్చు. కాని అది మీ శృంగార జీవితానికి అడ్డంకి కారాదు. పిల్లల సంరక్షణలో పడి మీ వాంఛలను మరచిపోతారు. భాగస్వామిని అశ్రద్ధ చేస్తారు. వారికి తగిన ఏర్పాట్లు చేయడం ద్వారా శృంగార క్రీడను కొనసాగించేందుకు ప్రయత్నించండి.

English summary
Sexual desires may decrease among the men and women due to depression and with other reasons. You can sort out these problems with taking right measures.
Story first published: Monday, March 11, 2013, 13:16 [IST]

Get Notifications from Telugu Indiansutras