కొంత మందిని ఎల్లవేళలా లైంగిక క్రీడకు సంబంధించిన ఆలోచనలే వెంటాడుతున్నాయి. ఈ సవాల్ కాస్తా ఆశ్చర్యకరమైందే. తనకు ఎల్లవేళలా సెక్స్ చేయాలనే కోరిక పుడుతుందని చెప్పేవారిని చూస్తే మనకు ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి చాలా మంది బిడియపడుతారు. అయితే, తెంపు లేకుండా నిరంతరాయంగా సెక్స్ గురించి ఆలోచనలు చేయడం మంచిది కాదు.
అలాంటి ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయ్యేవారు ఆ విషయాన్ని మిత్రుల నుంచి కూడా దాచుకుంటారు. అయితే ఇదేం రోగం కాదు, బుద్దిలో పుట్టే భ్రమ మాత్రమే. పురుషులైనా, స్మహిళలైనా ఇటువంటి వ్యసనాన్ని తొలగించుకోవడానికి మార్గం ఉంది. పైగా ఈ వ్యసనం రోజువారీ జీవితంలో ఓ చిక్కు సమస్యగా పరిణమిస్తుంది. అలాంటి స్థితి వస్తే చాలా ఇబ్బందికరమైన విషయమే.
వ్యసనం
మీకు పురుషుడు లేదా మహిళ ఎదురుపడినప్పుడు సెక్స్ చేయాలనే కోరిక పుడుతుందా?
లోదుస్తులు చూస్తే సెక్స్ ఆలోచనలు చుట్టుముట్టుడుతున్నాయా?
అప్పుడప్పుడు కాకుండా ఎక్కువగా హస్త ప్రయోగం చేసుకుంటున్నారా?
కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు కూడా సెక్స్‌పైకి మనసు పోతోందా?
ఏం చేయాలి?
ఆ వ్యసనాన్ని మానడం పెద్ద కష్టమేమీ కాదు. అది వ్యసనం లేదా అలవాటు మాత్రమే గానీ తీవ్రమైన వ్యాధి కాదు. తలుచుకుంటే దాన్ని దూరం చేసుకోవచ్చు. అటువంటి సందర్బంలో కాసేపు మీ జీవిత భాగస్వామితో సెక్స్ గురించి మాట్లాడండి.
మీ కుటుంబంపై, కుటుంబ సభ్యుల భవిష్యత్తుపై ఆలోచన చేయడం అలవాటు చేసుకోండి. ఈ ఆలోచనలో మీ జీవిత భాగస్వామితో పంచుకోండి. మీ జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికల గురించి, సంతానం కోసం చేసే పనుల గురించి మాట్లాడండి. ఒక్కసారి సెక్స్ చేసిన తర్వాత మరోసారి కార్యానికి సమయం ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.
మీకు పెళ్లి కాకపోతే, హస్త ప్రయోగం తప్పేమీ కాదు. కానీ, అదే పనిగా దానిపైనే దృష్టి ఉండకుండా కెరీర్‌పై దృష్టి పెట్టండి. మీ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుని అందుకు అనుగుణంగా మీ మనసు లగ్నం అయ్యేలా చూసుకోండి. ప్రతిదానికీ ఓ సమయం ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.