పురుషులు చాలా మంది శృంగారం విషయంలో ఊహల్లో తేలియాడుతుంటారు. వాస్తవాలను గమనించి, వాటికి అనుగుణంగా లైంగిక జీవితాన్ని సుఖమయం, రసమయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని వారు గుర్తించాల్సి ఉంటుంది. తగిన సమాచారం లేకపోవడం కూడా వారిని ఊహాప్రపంచంలో తేలియాడేలా చేస్తోంది. దానివల్ల శృంగార జీవితంలో ఆటంకాలు ఏర్పడుతాయి.
తన లైంగిక భాగస్వామితో రతి కార్యం చేస్తున్నప్పుడు మరొకరిని ఊహించుకోవడం సరి కాదని చాలా మంది భావిస్తుంటారు. లైంగిక క్రీడ మొదట మెదడు నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అంగాలతో పని. మెదడు ఒకచోట స్థిరంగా ఉండదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మహిళతో రతి కార్యం చేస్తున్నప్పుడు పురుషుడు ఏ అతి లోకసుందరినో ఊహించుకున్నా ఫరవాలేదు. తన మహిళతో లైంగిక క్రీడను ఆనందించడం, తన మహిళకు ఆనందాన్ని పంచివ్వడమే ముఖ్యం.
పురుషులు రతి కార్యంలో నిండా మునిగిపోతారు. ఒక్కోసారి స్కలనం ఎప్పుడు జరుగుతుందో కూడా గుర్తించలేనంతగా ఓలలాడుతారు. అటువంటి సందర్బాల్లో వీర్యం మహిళ యోనిలో పడకూడదనే తప్పుడు అభిప్రాయం కూడా కొంత మందిలో ఉంటుంది. అది సరి కాదు. పైగా, వీర్యం యోనిలో పూర్తిగా పడకపోతే గర్భం రాదనే అపోహ కూడా వారికి ఉంటుంది. కానీ, మీరు సంభోగం చాలు, మహిళ గర్భం దాల్చడానికి...
అమెరికాలోని ఆ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం పురుషులు ప్రతి రోజూ, ప్రతి రోజూ చాలా సార్లు రతి గురించి ఆలోచన చేస్తుంటారు. అటువంటి వారు 14 శాతం మంది ఉన్నట్లు తేలింది. 43 శాతం మంది నెలలో కొన్ని సార్లు లేదా వారంలో కొన్ని సార్లు ఆలోచిస్తుంటారు. నాలుగు శాతం మంది మాత్రమే నెలకోసారి, అంతకన్నా తక్కువ సార్లు ఆలోచన చేస్తుంటారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే - 19 శాతం మంది మహిళలు రోజూ ఒకసారి లేదా, రోజూ పలు మార్లు సెక్స్ గురించి ఆలోచన చేస్తారు. 67 శాతం మంది నెలలో కొన్ని సార్లు, వారానికి కొన్నిసార్లు ఆలోచిస్తారు. 14 శాతం మంది నెలలో ఒకసారి ఆలోచన చేస్తారు.
లైంగిక క్రీడ విషయంలో పురుషులు అలసట చెందరనే భ్రమ ప్రబలంగానే ఉంది. వారు కూడా విసుగు చెందుతారు. కొన్నిసార్లు సెక్స్ పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపరు. పురుషులు సెక్స్‌కు ఆసక్తి చూపడం లేదంటే, మీరు నచ్చక కాదని మహిళలు గుర్తించాలి. అతనికి మూడ్ లేకపోవడం కారణం కావచ్చుననే విషయాన్ని గ్రహించాలి.
పురుషాంగం సైజు విషయంలో చాలా మందికి అపోహలు ఉంటాయి. అయితే, తమ అంగం చిన్నగా ఉందని ఆందోళన చెందేవారు చాలా మంది ఉంటారు. అలా భావించే వాళ్లు కామసూత్ర పుస్తకం తీసుకుని మహిళలను సంతోషపెట్టడానికి అనువైన రతి భంగిమలను ఎంపిక చేసుకోవాలి.