పడక మీదికి భార్యాభర్తలు ఇద్దరూ వెళ్లాలని అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రతిక్రీడకు సిద్ధమయ్యే ఆలోచలను మెదడులో పురుడు పోసుకుంటాయి. రతిక్రీడను అదరగొట్టడానికి గదిని అలంకరించడం, కొవ్వొత్తులతో గదిని వెలిగించడం వంటివి చేస్తుంటారు. హాయిగా స్నానం చేసి, శుభ్రంగా తయారవుతారు.
వాసనకు సంబంధించిన విషయం కూడా రతిక్రీడలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రష్‌తో పండ్లను తోముకోవడంతో పాటు మౌత్ ఫ్రెషనర్స్ వాడవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను కూడా వదిలేస్తే మంచిదని అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు కామోద్రేక స్థాయిని పెంచుతాయి.
కొంత మంది దంపతులు చాకొలేట్, స్ట్రాబెర్రీ వంటి పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడతారు. వాటివల్ల కామవాంఛ పుడుతుందని అంటారు. సెక్స్‌కు ముందు తీసుకోకూడని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయని గమనించడం మంచిది. వెల్లుల్లి, ఉల్లిగడ్డలు వంటివి తీసుకోకపోతే మంచిది. అవి నోటి నుంచి వాసనకు కారణమవుతాయి.
స్పైస్ ఆహారానికి సువాసనను, పరీమళాన్ని అద్దుతుంది. అయితే రతిక్రీడ సాగించే సమయంలో అది మరో మలుపు తీసుకోవచ్చు. నోటి నుంచి వెల్లుల్లి వాసనను తొలగించుకోవడం చాలా కష్టమైన పని. దీన్ని సెక్స్కు ముందు వదిలేయడం మంచిది.
ఉడికించని అల్లం తింటే రతిక్రీడకు ఆటంకం కలగవచ్చు. ఉడికించని అల్లం తీసుకోవడాన్ని సెక్స్కు ముందు తినకండి.
చిక్కుడు జాతి కూరగాయలు ఆరోగ్యానికి మంచివే. కాని కామవాంఛను దెబ్బ తీస్తాయి. కడుపు బరువుగా తయారవుతాయి. గ్యాస్, తదితర పొట్ట సంబంధమైన సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటే వాటిని సెక్స్కు ముందు తీసుకోకపోవడం మంచిది.
వైన్తో చీజీ బైట్స్ ఆనందాన్ని ఇస్తుంది. ఈ రెండింటి కలయిక రోమాంటిక్గానే ఉంటుంది. అయితే, కడుపులో సమస్య తలెత్తుతుంది. పండ్ల మధ్య అది ఇరికిపోవచ్చు కూడా. దానివల్ల దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రతిక్రీడకు ముందు వాటిని వదిలేయండి.
మాంసం కడుపునకు బరువు అవుతుంది. లేజీగా ఉండకూదని అనుకుంటే దాన్ని తినకపోవడం మంచిది. రతిక్రీడకు ముందు దాన్ని తినడం మానేయండి.
గ్రెయిన్ బ్రెడ్ పండ్ల సందుల్లో ఇరికిపోతుంది. దానివల్ల దుర్వాసన వస్తుంది. ఫైబర్ ఫుడ్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. రతిక్రీడకు ముందు దాన్ని తినకండి.
డిన్నర్కు చైనీస్ వంటకం నూడిల్స్ బాగా ఉంటుంది. కానీ దాన్ని తినడం మానేయండి. కడుపునకు అది భారంగా ఉంటుంది. జీర్ణం కావడానికి సమయం తీసుకుంటుంది. మీ భాగస్వామి మంచి మూడ్లో ఉన్నప్పుడు దాన్ని తినేసి గుర్రుపెట్టి నిద్రపోవడం సరి కాదు.
కొన్ని తీపిపదార్థాలను నమలడం వల్ల కామవాంఛ పుడుతుంది. సెక్సీగా కూడా ఉంటుంది. అయితే, కృత్రిమ తీపిపదార్థాల వల్ల పొట్ట సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. నోటి నుంచి దుర్వాస కూడా వస్తుంది. వాటిని వదిలేయండి.
రతిక్రీడకు ముందు ఎర్ర మాంసం, జున్ను వంటివి ఏ మాత్రం యోగ్యమైనవి కావు. అవి దుర్వాసనను వెదజల్లడమే కాకుండా జీర్ణం కూడా కావు. రతిక్రీడలో వాటివల్ల చురుకుదనం తగ్గుతుంది.