•  

మహిళలు సెక్స్ ఆలోచనలు ఎందుకు చేస్తారు?

సెక్స్ గురించి పురుషులే ఎక్కువగా ఆలోచిస్తారని అనుకుంటారు. కానీ మహిళలు కూడా సెక్స్ గురించి తరుచుగా ఆలోచన చేస్తుంటారని నిపుణులు అంటున్నారు. అయితే, కేవలం లైంగిక క్రీడ ద్వారా సుఖాన్ని ఆస్వాదించడానికి మాత్రమే కాకుండా అంతకన్నా మించిన అనుబంధాన్ని తన భాగస్వామితో పెంచుకోవడానికి వారు లైంగిక క్రీడను వాంఛిస్తారని అంటున్నారు.



అయితే, మహిళలు కేవలం సెక్స్‌ను మాత్రమే వాంఛించి సంబంధాలను పెట్టుకోరని అంటున్నారు. తన భాగస్వామి సెక్స్ పట్ల విముఖత ప్రదర్శిస్తోందని చాలా మంది పురుషులు ఫిర్యాదు చేస్తుంటారు. అటువంటి పురుషులకు తమ స్త్రీలను అనునయించి, భరోసా కల్పించి, సాన్నిహిత్యాన్ని పెంచుకునే మార్గాలు సరిగా తెలిసి ఉండవని భావించవచ్చు. అయితే, ఆధునిక స్త్రీలు రతిక్రీడను కోరుకునే విషయంలో పురుషులతో సమానంగా ఉంటున్నారని అధ్యయనాల్లో తేలింది.



శారీరక సుఖం కూడా..



రతి క్రీడ ద్వారా శారీరక సుఖాన్ని పొందడాన్ని కూడా చాలా మంది మహిళలు కోరుకుంటారు. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన రతిక్రీడ ఆమెకు శారీరక సంతృప్తిని కలిగిస్తుంది. ఇది అతి సాధారణమైంది. సెక్స్ అనేది వ్యక్తి ప్రాథమికావసరమని నిపుణులు అంటున్నారు. తమ పురుషులు తమను శారీరకంగా సుఖపెట్టలేకపోతున్నారని ఫిర్యాదు చేసే మహిళలు కూడా పెరిగినట్లు చెబుతున్నారు.



Why Women think about Sex more often
 



సానుకూల భావాలను పెంపొందిస్తుంది...



శృంగారంలో సంతృప్తిని పొందాలంటే దాన్ని ఆనందప్రదమైన క్రీడగా భావించి, పురుషుడితో సమానంగా రతిక్రీడలో చురుగ్గా పాల్గొంటే సంతృప్తి లభిస్తుంది. భర్త ఇంటికి రాగానే హత్తుకుని, అతన్ని సంతోషపెట్టాలనే కోరికను చాలా మంది మహిళలు ఆధునిక కాలంలో వ్యక్తీకరిస్తున్నారు. చూడగానే తన భర్త దృష్టి పడేలా అలంకరించుకోవడం అనేది భారతీయ సంప్రదాయంలో కూడా ఉంది. లైంగిక క్రీడ మహిళల్లో సానుకూల భావోద్దీపనకు పనికి వస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.



పురుషుడికి దగ్గర చేస్తుంది....



శృంగార క్రీడ తన పురుషు జీవిత భాగస్వామితో సాన్నిహిత్యాన్ని పెంచి, అనుబంధాన్ని దృఢపరుస్తుంది. లైంగిక క్రీడను దంపతులు సాధారణ క్రీడగా భావించరని అంటారు. అనుబంధం దృఢం కావడానికి దాన్ని ఓ సాధనంగా భావిస్తారు.



అవాంఛనీయమై ఆలోచనలను దూరం చేస్తుంది...



లైంగిక క్రీడ ప్రతికూల భావాలను తుడిచేస్తుంది. మనసుకూ శరీరానికి ఊరట ఇస్తుంది. కార్యాలయంలో పని ఒత్తిడితో అలసిపోయినప్పుడు, పనులు సాఫీగా జరగక చిరాగ్గా ఉన్నప్పుడు జీవిత భాగస్వామితో శృంగార క్రీడ ఎంతో హాయిని ఇస్తుంది, మనసు తేలికపడి ఉల్లాసంగా ఉంటుంది. రతిక్రీడలో దీర్ఘమైన శ్వాస వల్ల, జీవిత భాగస్వామి స్పర్శ వల్ల మనసు తేలికపడుతుందని అంటున్నారు.



వ్యాయామం కూడా అవుతుంది....



దాదాపు 30 నిమిషాలు రతిక్రీడ జరిపితే 85 కాలరీలు కరిగిపోతాయి. రతిక్రీడ వ్యాయామం చేసిన ఆరోగ్యాన్ని అందిస్తుందని అంటున్నారు. ఎక్కువ సేపు సెక్స్ చేయడం వల్ల దేహం బరువు తగ్గిన సంఘటనలు చాలా ఉన్నాయని చెబుతున్నారు.

English summary
'Men think, while women desire.' Gone are the days when 'demanding sex' was considered exclusively a man's forte. Today women demand sex greater than men.
Story first published: Thursday, December 27, 2012, 15:17 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras