కామం అనగానే మనకు స్పురణకు వచ్చేది రెండు దేహాల కలయిక. ఆ రెండు దేహాలు కలిసిపోయి కామవాంఛను తీర్చుకోవడం అనేది మనకు తెలిసిన విషయం. మనసుకూ కామానికీ సమీప బాంధవ్యం ఉంది. మనసు నుంచి పుట్టందే దేహాలు ఒక్కటి కావడం సాధ్యం కాదు. అంటే, మనస్సు నుంచి దేహానికి ప్రసారం అయ్యేదే కామం. మనసే అన్నింటికీ ప్రధానం కాబట్టి మనసులో పుట్టిందే కామం అన్నారు. మనస్సులో పుట్టకుండా దేహంలో చలనం రాదు మరి.
మన్మథుడికి ఇంకో పేరు కాముడు. అతనికి మనసిజుడు అనే పేరు కూడా ఉంది. అంటే మనసు నుంచి పుట్టినవాడని అర్థం. మనసులో పుట్టే కోరికకు మన్మథుడనే ఒక పేరు పెట్టారని అనుకోవచ్చు. నిజానికి, పురాణాల్లో కూడా మన్మథుడికి దేహం లేదని చెప్పారు. శివుడి చూపులకు అతను దగ్ధమైపోయాడని ఐతిహ్యం ఉంది. అయితే, అతని భార్య రతీదేవి పరిపరి విధాల ప్రార్దించండంతో రూపంలోని మన్మథుడిని ప్రసాదించాడని అంటారు.
ఆ విషయాలనే వాత్స్యాయనుడు కాస్తా పూత పూసి చెప్పాడు. అంతరార్థాలను విడమరిచారు. ఆత్మ అంటే జీవుడు. ఆ జీవాత్మలో లీనమై ఉన్నదే మనస్సు. మానవ దేహంలోని ప్రతి అవయవం మనస్సు ఆదేశాల మేరకే పని చేస్తుంది. చర్మంతో సహా అవయవాలన్నీ ఇలా మనస్సు చెప్పింది చెప్పినట్టు తమ ధర్మాలను నిర్వర్తించడమే కామం అంటాడు వాత్స్యాయనుడు. అతడు ఏ ఒక్క అవయవానికో కామాన్ని పరిమితం చేయలేదు. ఇంద్రియాల ద్వారా పలు విధాలైన భావనలను అనుభవిస్తున్నప్పుడు జీవాత్మకు సుఖం, ఆనందం కలుగుతుంటాయి. ఆ సుఖం, ఆనందమే కామమని అతను చెప్పిన అర్థం.
ఆ సాధారణ కామం కాకుండా, విశేష కామం అని ఒకటి ఉంది. అది రతి సమయంలో స్త్రీ పురుషుల మధ్య స్వర్శ కారణంగా సంభవించేది. ఇలాంటి కామం కోసమే యువతీయువకులు మనస్సులో తపించిపోతుంటారు. రతి సమయంలో తమకంతో ఉన్న స్త్రీ దేహం సర్వ విధాలా విచ్చుకుంటుందని చెబుతారు. సాధారణ స్థితి కన్నా మరింత మృదువుగా, సున్నితంగా రూపాంతరం చెందుతుందట.
ఆ సమయంలో మహిళ పక్కన ఉన్న పురుషుడి దేహం, మనస్సు కఠినతరంగా మారుతాయి. అలక్ష్యమైన విన్యాసాలతో స్త్రీ దేహాన్ని నొప్పించేందుకు పురుష దేహం రాటు తేలుతుంది. ఆ మొరటుతనాన్ని స్త్రీ ఇష్టపడుతుంది. తనలో ఇముడ్చుకోడానికి ప్రాణాలన్నీ కూడగట్టుకుని లోనికి ఆహ్వానిస్తుంది. సరిగ్గా ఆ క్షణాలో ముద్దుల వల్ల, గోళ్లతో రక్కడం, కొరకడం వంటివాటి వల్ల జివ్వున సుఖం చిమ్ముతుంది. దాన్నే అర్థ ప్రతీతి అంటారని చెబుతారు.
స్కలనావస్థలో ఏ ఇంద్రియం అయితే సుఖానికి కారణమైన కర్మను పుట్టిస్తుందో ఆ ఇంద్రియం తాలూకూ అంతరంగిక స్పర్శ విశేష్నాని గురించిన భావమే... అర్థప్రతీతి. మామూలు మాటలో చెప్పాలంటే 'ఈ పురుషుడు నన్ను అన్ని విధాలా అనుభవిస్తున్నాడు. నా సర్వస్వాన్ని దోచుకుంటున్నాడు. నాలోని అందాన్ని, సామరస్యాన్ని పిండుకుని, వడగట్టుకుని తాగి దాహం తీర్చుకుంటున్నాడు. నాలో పిప్పిని మాత్రమే మిగులుస్తున్నాడు' అనుకుంటుందట మహిళ.
అలాగే, 'ఈమెను ఏ మాత్రం మిగలకుండా దోచేసుకుంటున్నా. ఈ పని నేను తప్ప ప్రపంచంలో వేరెవ్వరూ చేయలేనంతగా ముందుకెడుతున్నాను' అనుకుంటూ పురుషుడు పొందే మానసిక, శారీరక సుఖమే అర్థ ప్రతీతి అని చెబుతున్నారు.