మహిళలు తమ రొమ్ముల పట్ల ఎప్పుడూ జాగ్రత్త వహిస్తుంటారు. అయితే, వాటి గురించి వారికి తెలిసింది కూడా తక్కువేనని నిపుణులు అంటున్నారు. స్తనాలు కామోద్రీకాన్ని కలిగించడమే కాకుండా అవి సౌందర్యానికి, ఆడతనానికి సంకేతాలుగా నిలుస్తాయి. వాటి గురించి మహిళనే కాదు, పురుషుడు కూడా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి.
ఎడమ రొమ్ము కాస్తా పెద్దది..
స్తీ రొమ్ములు రెండు కూడా సమానంగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఎడమ పక్క రొమ్ము కాస్తా పెద్దగా ఉంటుందట. చను మొనలు కూడా అదే విధంగా ఉంటాయని అంటున్నారు. అవి విభన్నమైన దిశలో ఉంటాయి.
చనుమొనల మీద రోమాలు
ఇది నమ్మడానికి కాస్తా కష్టమైన విషయమే. కానీ స్తీల చనుమొనల మీద రోమాలుంటాయి. వాటిపై నల్లటి, నిలువు రోమాలు మొలుస్తాయట. స్త్రీ శరీరం, వెంట్రులు ఎంత నల్లగా ఉంటాయో చనుమొనల మీద వెంట్రుకలు కూడా అదే నలుపుతో ఉంటాయట. వక్షోజాలపై మచ్చలు, బొడిపెలు వచ్చే ప్రమాదం ఉంది. వీటి విషయంలో జాగ్రత్త వహించాలి.
సగటు రొమ్ము బరువు 0.5 కిలోలు
మహిళ సగటు రొమ్ము అర కిలో ఉంటుందట. మహిళ శరీరం కొవ్వులో రొమ్ముల కొవ్వు 4 - 5 శాతం ఉంటుంది. అదే విధంగా మహిళ శరీరం బరువులో రొమ్ముల బరువు ఒక శాతం ఉంటుందట.
రెండు మిలియన్ల మందికి నకిలీ రొమ్ములే...
పమేలా అండర్సన్ నుంచి కాటే ప్రైస్ వరకు దాదాపు 2 మిలియన్ల మంది రొమ్ముల ఇంప్లాంటేషన్ చేయించుకున్నట్లు చెబుతారు. దీన్ని బట్టి మహిళలు రొమ్ముల గురించి ఎంతగా పట్టించుకుంటారో అర్థమవుతుంది.
కామోద్రేక సమయంలో పెరుగుతాయి
మహిళల్లో కామోద్దీపన కలిగినప్పుడు రొమ్ములు పెద్దవి అవుతాయట. అంటే, కామవాంఛను అవి ప్రకోపింపజేస్తాయన్న మాట.
రొమ్ములు కదలడం ఇబ్బందే..
జాగింగ్, వాకింగ్, ఎరోబిక్స్ వల్ల రొమ్ములు దెబ్బ తినే ప్రమాదం ఉందని అంటున్నారు. అందువల్ల సరైన బ్రా ధరించాలని చెబుతున్నారు. దానివల్ల వక్షోజాలకు నొప్పి ఉండదు. బ్రా అనేది వక్షోజాల సంరక్షణ కోసమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
రొమ్ముల ఆకారం దెబ్బ తింటుంది
గుండ్రంగా ఉండే రొమ్ములు జారిపోయి, ఆకారం మారే అవకాశాలున్నాయి. నిద్ర పోయే పద్ధతి కూడా రొమ్ముల ఆకారాన్ని మార్చే అవకాశం ఉంటుంది. సరైన భంగిమలో నిద్రపోతే అవి పట్టు తప్పకుండా ఉంటడాయని అంటున్నారు.