1. దేహాన్ని కదిలించండి
చలనం లేదా కదలికలు ముఖ్యం. హడావిడి, అయోమయమైన కదలికలు విశ్వాసాన్ని నింపలేవు. తొందరపాటు కొంప ముంచుతుంది. నియంత్రిత కదలికలు మీరు ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ఎదుటివారికి అనిపిస్తాయి. ఎదుటివారు దాంతో చాలా సౌకర్యంగా ఫీలవుతారు.
2. మగాడిలా నడవండి
నడిచేటప్పుడు మంచి పోస్చర్ అవసరం. తలను కిందికేసి, చేతులను జేబుల్లో పెట్టి నడిస్తే మీరు ముడుచుకుపోయినట్లు అనిపిస్తుంది. ఎదుటివారు స్వేచ్ఛగా మీతో వ్యవహరించలేరు. భుజాలు కదిలిస్తూ తల పైకెత్తి నడిస్తే ఎదుటివారు మీకు దగ్గరగా వస్తారు.
3. సీట్లో మెరిసిపోండి
మీరు ఎదుటివారితో సంభాషించేప్పుడు ఎక్కువగా కూర్చుని ఉంటారు. ఇతరులతో సమయం వెచ్చిస్తున్నప్పుడు కూర్చునే ఉంటారు. కూర్చున్నప్పుడు చాలా రిలాక్స్ ఉన్నట్లు కనిపించడం మంచిది. సౌకర్యంగా ఉండే విధంగా చూసుకోండి. చేతులు కట్టుకోవద్దు. దానివల్ల మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నంలో ఉన్న భావన ఎదుటివారికి ఏర్పడుతుంది.
4. ఫ్రీగా ఉండండి
మహిళతో మాట్లాడుతున్నప్పుడు దేహం ముడుచుకుపోయే విధంగా ఉండకూడదు. అరచేతులు తెరిచి ఉండాలి, చేతులు మీ వైపు ఉండాలి. కూర్చున్న స్థితిలో ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకోకూడదు. చేతులు కట్టుకోవడం, కాలుపై కాలు వేసుకోవడం వల్ల మీరు స్వేచ్ఛగా లేరనే భావన ఆమెకు కలుగుతుంది.
5. చూపులతోనే సూదులు..
కళ్లలో కలపడం అనేది అత్యంత ముఖ్యమైంది. మీలోని విశ్వాసాన్ని, నిజాయితీనీ మహిళ ఎక్కువగా ఇష్టపడుతుంది. కళ్ల కన్నా బాగా ఆ విషయాన్ని చెప్పగలిగేవి ఏవీ ఉండవు. మాట్లాడుతున్నప్పుడు సంభాషణకు అనుగుణంగా కళ్లను తిప్పుతూ వెళ్లండి. ఆమె పట్ల మీకు ఆసక్తి ఉందనే విషయాన్ని కళ్ల ద్వారా, చూపుల ద్వారానే ఆమెకు అర్థమయ్యేలా చేయవచ్చు.
6. నవ్వే మంత్రం
మీ పట్ల మహిళ ఆకర్షణకు గురి కావడానికి నవ్వు అత్యంత శక్తివంతమైన ఆయుధం. మీ నవ్వునే ఎదుటి వారు ముందుగా తమ మనసులో నిలుపుకునేది. నవ్వు మీ విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని తెలియజేస్తుంది.
7. సన్నిహితంగా, కానీ స్వేచ్ఛగా..
మీకు, ఆమెకు మధ్య కెమిస్ట్రీ కుదురుతుందని నమ్మకం కుదిరినప్పుడు కొన్ని సార్లు బోల్డ్‌గా వ్యవహరించడం అవసరం. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు చేతుల్లో చేతులు కలపడం తొలి మెట్టు. తొందరపాటు కూడదు. ఇబ్బందికరంగా ఉండకూడదు. ఆమెకు తగిన సమయం ఇవ్వండి. మీ సంకేతాలను అర్థం చేసుకుని, అంగీకారంగా ముందుకు కదలడానికి అవసరమైన సమయం ఆమెకు ఇవ్వాలి.